రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన తన షూటింగ్ భాగాన్ని ప్రభాస్ ఎప్పుడో పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఎప్పుడో పూర్తి అయ్యాయి. కాకపోతే ఈ సినిమాకు భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా రోజులను కేటాయించింది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ ని జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రభాస్మూవీ లో రాముడు పాత్రలో నటించగా ... కృతి సనన్మూవీ లో సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో రావణుడి పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నైజాం హక్కులను మైత్రి మూవీ సంస్థ వారు 60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: