ఏ విషయంలో అయినా విజయం సాధించాలి అంటే ఆ దిశగా జీవితాన్ని మలుచుకోవడానికి ఒక నిర్దిష్ట లక్ష్యం కలిగి ఉండాలి. ఆ నిర్దిష్ట లక్ష్యం చేరుకోవడానికి మన దైనందిన జీవితంలో ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. అయితే ఒక వ్యక్తికి నిర్దిష్ట లక్ష్యాలు లేకుండా ఉండడానికి అనేక కారణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి.


సుమారు 20 సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 20 వేలమంది విజయాన్ని సాధించిన వ్యక్తుల జీవితాలను విశ్లేషించిన నెపోలియన్ హిల్ కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టాడు. ప్రపంచంలో సుమారు 95 శాతం మంది పరాజితులుగా జీవిస్తున్నారని దీనికి గల ప్రధాన కారణం వారికి సరైన లక్ష్యాలు లేకపోవడం అన్న అభిప్రాయం నెపోలియన్ హిల్ వ్యక్త పరిచాడు.


జీవితంలో ఉండే లక్ష్యాలు ఒకొక్క వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. ఒక వ్యక్తికి సొంత ఇల్లు కొనుక్కోవడం ఒక లక్ష్యం అయితే మరొక వ్యక్తికి ఒక మంచి దుస్తుల జత కొనుక్కోవడం లక్ష్యంగా ఉంటుంది. అయితే ఈ లక్ష్యాలు అన్నీ ఒక వ్యక్తి కోర్కెలకు సంబంధించినవి. అయితే మనం చేసే పనిలో లేకుంటే ఉద్యోగంలో వ్యాపారంలో ఒక నిర్దిష్ట ప్రధాన లక్ష్యం లేకుండా కేవలం కోర్కెలకు సంబంధించి లక్ష్యాలు పెట్టుకునే వారు జీవితంలో రాణించరు.


అంతేకాదు వివిధ రంగాలలో ప్రముఖులుగా రాణిస్తున్న వారు తమ అదృష్టాన్ని కంటే ఎక్కువగా తమ కృషిని నమ్ముకున్నవారు మాత్రమే. విజయాన్ని ఒక వ్యక్తి ఒకొక్క కోణంలో ఊహించుకుంటూ ఉంటాడు. అందుకే విజయానికి సంబంధించి ఎవరి నిర్వచనం వారిధి. అమెరికాలో అయితే 60 సంవత్సరాల వయసు దాటిన తరువాత చదువుకుని డాక్టర్స్ గా లాయర్స్ గా రాణిస్తున్నవారు ఎందరో ఉన్నారు. అయితే ఆ వయసు వచ్చే సరికి మన ఇండియాలో మాత్రం ఏపని చేయడానికి ఇష్టపడకుండా చాలామంది విశ్రాంతి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. 60 సంవత్సరాలు వచ్చిన తరువాత కూడ ఒక వ్యక్తి అమెరికాలో డాక్టర్ గా రాణించాడు అంటే అతడికి విజయాన్ని సాధించాలనే లక్ష్యం లో ఉన్న ప్రధాన కోరిక. మనిషిగా నిర్దిష్ట లక్ష్యం లేనివాడు జీవితంలో రాణించి ఐశ్వర్యాన్ని పొందలేడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: