ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష మందికి అమ్మకాల విషయంలో అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించిన మెళుకువలు విషయంలో శిక్షణ ఇచ్చిన నెపోలియన్ హిల్ ఐశ్వర్యం పొందాలి అనుకునే వారికి పంచ శక్తులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఒక వ్యక్తి వ్యారంలో రాణించడానికి అదృష్టం ఉండాలి అని భావిస్తూ ఉంటారని అయితే పంచ శక్తులు ఉంటే చాలు అంటూ నేపోలీయన్ హిల్ ప్రతిపాదించిన ఈ పంచ శక్తుల సిద్ధాంతాన్ని ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలోని మనీ ఎక్స్ పర్ట్స్ విశ్వసిస్తూ ఉంటారు.


సాధారణంగా ఒక బిజినెస్ డీల్ కు సంబంధించి ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు కరచాలనం చేయడం పరిపాటి. అయితే ఇప్పడు కరోనా రావడంతో ఈ కరచాలనం అలవాటు తాత్కాలికంగా వైదొలిగినా కొంత కాలం తరువాత ఈ కరచాలన అలవాటు మళ్ళీ బిజినెస్ సర్కిల్స్ లో సర్వసాధారణంగా కనిపించే ఆస్కారం ఉంది. ఈ కరచాలనం చేసే వ్యక్తి చేతిలోని స్పర్స లో ఒక ఆకర్షిణ శక్తీ ఉండాలని అప్పుడే ఎదుటి వ్యక్తికి మంచి అభిప్రాయం ఏర్పడుతుందని అంటారు.

అదేవిధంగా కంఠస్వరం కూడ పంచ శక్తులలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఒక వ్యక్తి గొంతు చాల ధృఢoగా ఉండటమే కాకుండా ఆ గొంతుకు ఒక అయిస్కాంత శక్తీ కలిగి ఉండాలి. అదేవిధంగా శారీరక భంగిమలకు సంబంధించి ఒక వ్యక్తి నడిచే విధానంలో కూర్చునే పద్దతిలో ఆకర్షణీయంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితం చేసే విధంగా బాడీ లాంగ్వేజ్ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా ఐశ్వర్య వంతుడు అయి తీరుతాడని చాలామంది మనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ పంచ శక్తులలో మరొక కీలకమైన ప్రధాన శక్తి దేహాలంకరణ. చురుకైన వ్యక్తిత్వంతో పాటు మంచి ఆకర్షణీయమైన వస్త్రాలంకరణ ధరించిన వారు సమాజంలో తమ పట్టును నిలుపుకుంటూ తాము ఎంచుకున్న వ్యాపారాలలో విజయం సాధించే ఆస్కారం ఎక్కువగా ఉందని నెపోలియన్ హిల్ అభిప్రాయపడుతున్నాడు. ఇలా ఈ ఐదు శక్తులు కలిగిన వ్యక్తికి సంకల్ప బలం హెచ్చుగా ఉండి తాము ఎంచుకున్న వ్యాపారాలలో విజయం సాధించి ఐశ్వర్య వంతులు అవుతారని చాలామంది భావన..   

మరింత సమాచారం తెలుసుకోండి: