మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గం వారు క్రెడిట్ కార్డ్స్ లేకుండా వారి ఆర్ధిక జీవనశైలిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనదేశంలో ప్రతి సంవత్సరం కోటిన్నర కొత్త క్రెడిట్ కార్డులు జారీ అవుతున్నాయి అంటే క్రెడిట్ కార్డుల పట్ల జనంలో ఎంత ఆశక్తితో పాటు ఆవశ్యకత కూడ పెరిగిపోయిందో అర్ధం అవుతుంది. దేశంలో క్రెడిట్ కార్డు కొత్తగా తీసుకున్న వారిలో చాలామందికి ఎలా వినియోగించాలో అర్థం కావడం లేదు అని ఒక సర్వే చెపుతోంది.



ఇలా అవగాహన లేకపోవడంతో చాలామంది తమ క్రెడిట్ కార్డ్స్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను మిస్ అవుతూ అనవసరంగా ఎక్కువ చార్జ్లు కడుతున్నారు అని ఆసర్వే అభిప్రాయ పడింది. చాలామంది తమ పరిస్థితులకు సరిపోయే కార్డును ఎంపిక చేసుకోవడంలో విఫలం అవుతున్నారని ఆసర్వే తెలియచేసింది. బ్యాంకులు క్రెడిట్ కార్డు కంపెనీలు ఇచ్చే క్రెడిట్ కార్డులు అన్ని వర్గాల ప్రజలకు సరిపోవనీ దీనితో ఎవరికి వారు తమకు సూటయ్యే కార్డును ఎంపిక చేసుకోవాలి సర్ చార్జ్ పడకుండా కార్డు వాడే కొద్ది వాటిపై ఆఫర్లు వచ్చే క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.



ఎక్కువగా ప్రయాణాలు చేసే వారైతే ఎయిర్ పోర్ట్ లాంజ్ ఫెసిలిటీతో పాటు ట్రావెల్కు ఆఫర్లు ఉండే కార్డును తీసుకోవాలి. అలాగే డిజిటల్ పేమెంట్లు ఎక్కువ చేస్తామనుకుంటే రివార్డు పాయింట్లు ఎక్కువ వచ్చే క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. ఇలా అన్ని బ్యాంకుల్లోనూ చాలారకాల కార్డులు ఉంటాయి కాబట్టి కార్డును ఎంపిక చేసుకునే డప్పుడు మనకు ఏది సరిపోతుందో మనకు మనమే అంచనా వేసుకోవాలి.క్రెడిట్ కార్డులకు సంబంధించి బిల్లులు సయమానికి కట్టడం ఎంతో ముఖ్యం. ఒకవేళ డ్యూ డేట్ దాటిపోతే బ్యాంకు నిబంధనల ప్రకారం పెనాల్టీ పడుతుంది. అందువల్ల క్రెడిట్ కార్డు పేమెంట్స్ విషయంలో చాలజాగ్రత్తలు తీసుకోవాలి.




ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకోవడం ఉత్తమమైన పని. అయితే బిల్లింగ్ డేట్ మధ్య దూరం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు రెండు కార్డులు ఉంటే ఒకటి 15వ తేదీ మరొకటి 30వ తేదీకి బిల్లింగ్ ఉండేలా చూసుకుంటే మంచిది అని మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ఒకకార్డును 15 వరకు వాడి రెండో కార్డులోకి వెళితే మొత్తంగా 40-45 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా క్రెడిట్ కార్డు వినియోగించవచ్చు. అయితే క్రెడిట్ కార్డును వినియోగించుకునే వారు అంతా తమ క్రెడిట్స్ స్కోరును కాపాడుకుంటు ఆకార్డును ఇష్టం వచ్చిన రీతిలో వినియోగించుకుంటే భవిష్యత్ లో క్రెడిట్ స్కోర్ దెబ్బతిని ఋణాలు పొందే విషయంలో అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: