గత రెండు వారాలుగా కొనసాగిన షేర్ మార్కెట్ పరుగులకు నిన్న బిగ్ బ్రేక్ పడింది. ఐరోపా నుండి చైనా వరకు అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్ళీ హెచ్చరికలు ఇవ్వడంతో షేర్ మార్కెట్ ఒత్తిడి పెరిగి నిన్న అంతా షేర్ మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ కొనసాగింది.


ఈ పరిస్థితి ఈ నెలాఖరి వరకు కొనసాగే ఆస్కారం ఉందని విశ్లేషకులు అబిప్రాయ పడుతున్నారు. మరొక వైపు సాధారణ బడ్జెట్ సమర్పణ తేది దగ్గర పడుతూ ఉండటంతో మార్కెట్ కొంత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉందని మదుపర్లు భావించడంతో చాలామంది లాభాల స్వీకరణకు ఒకేసారి ప్రయత్నించడంతో ఒత్తిడికి లోనైన షేర్లు పతనం వైపు అడుగులు వేసాయి. ఈ వారం రిఫైనరీ కంపెనీల షేర్లు బలంగా కదలాడుతాయి అన్న అంచనాలకు అనుగుణంగా అనేక చమురు రిఫైనరీ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి.


అదేవిధంగా కొన్ని వారాలుగా రాణిస్తున్న సిమెంట్ కంపెనీల షేర్లు ఈవారం అంతా కొంతవరకు దిద్దుబాటు చర్యకు గురికావచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితులలో ఈవారంతంలోపు ఔషద కంపెనీల షేర్లు రాణించవచ్చు అన్నఅంచనాలు వస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం భారత్ లోని ఐటీ కంపెనీలు బాగా రాణిస్తాయని అంచనాలు వస్తున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు అన్నీ తమ ఖర్చులు తగ్గించుకుని క్లౌడ్ టెక్నాలజీ లోకి మారుతున్న పరిస్థితులలో భారత ఐటీ కంపెనీలకు మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉందన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రవేసపెట్టే బడ్జెట్ లో అనేక సవాళ్లు ఉన్నాయని వాటిని అధికమించి ‘వి’ షేప్ రికవరీలో ఇండియన్ ఎకానమీ పరుగులు తీయగల దిద్దుబాటు చర్యలు కొత్త బడ్జెట్ లో కనిపించినప్పుడు మాత్రమే షేర్ మార్కెట్ మరింత వేగంగా పరిగెడుతుంది లేదంటే అనేక ఆటుపోట్లకు అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: