ఏ ఇండస్ట్రీలోనైన ఓపిగ్గా ఎదురు చూస్తే ఖచ్చితంగా సక్సస్ అవుతాము. ఇందుకు ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. సినిమా వాళ్ళకైతే సరైన బ్రేక్ వచ్చే వరకూ సహనం తప్పనిసరి. బ్రేక్ వచ్చాక వరుసగా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా కంగారు పడి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కావాలనుకుంటే నెగ్గుకు రావడం కష్టం. బోలెడంత టైమ్ వేస్ట్ అవుతుంది.. ఆశించిన ఫలితం దక్కదు. పాజిటివిటీతో దూసుకుపోయే వాళ్లకు తెలుగు సినీపరిశ్రమ విజయాల్ని కట్ట బెడుతుంది. మంచి అవకాశాల్ని అందిస్తుంది. ఈ తరహా లక్షణాలు నేటితరం హీరోయిన్స్ లో ఎవరికి ఉన్నాయి.. అంటే వెంటనే వినిపించే పేరు రాశీ ఖన్నా.

అసలు రాశీ కి ఇప్పటిదాకా కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలే లేవు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటుంది. దాదాపు ఆరేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంది. తనకు తొలి అవకాశం ఇచ్చిన ఈ పరిశ్రమలోనే సత్తా చాటాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకుని ఎంతో సహనంతో లక్ చెక్ చేసుకుంది. నాగశౌర్య, సందీప్ కిషన్ sలాంటి చిన్న హీరోలతో కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు ఏకంగా పెద్ద స్థాయి హీరోల సరసన నటించేందుకు రెడీ అవుతోంది. ఓవైపు కుర్ర హీరోలకు రాశీ బెస్ట్ ఆప్షన్ గా మారింది. సాయిధరమ్- సందీప్ కిషన్ - వరుణ్ తేజ్ లాంటి హీరోల సరసన నటించింది. వీళ్ళతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఛాన్సిచ్చాడు.

ఇప్పుడు ఏకంగా పెద్ద హీరోల కళ్లు రాశీ మీద పడుతున్నాయి. మరోవైపు తమిళంలోనూ రీసెంట్‌గా విశాల్ సరసన టెంపర్ రీమేక్ అయోగ్య లో నటించి ఓ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలు ఛాన్సులిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అందం ఉంది.. ప్రతిభ ఉంది.. దానికి మించి గట్టి ఫ్లాప్స్ వచ్చినా ఓపిగ్గా ఎదురుర్కోగలిగే సత్తా ఉంది. అందుకే ఈ ధీక్ష ఎట్టకేలకు ఫలించి వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయట. దాదాపు ఆరేళ్ల నుంచి సక్సస్ కోసం వెయిట్ చేసినందుకు ఫలితం దక్కిందనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో కొన్ని వరుస ఫ్లాపులొచ్చినా తిరిగి కంబ్యాక్ అయింది రాశీ! త్వరలో రాబోతున్న 'ప్రతిరోజు పండగే' తో మరో హిట్టు తన ఖాతాలో వెసుకుంటుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: