టాలీవుడ్ లో నేటి జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్ ది విభిన్న శైలి. బాల నటుడిగా నటించిన రామాయణం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకూ.. అందరి చూపు ఎన్టీఆర్ వైపు ఉంటుందంటే అది తన కష్టం అనే చెప్పాలి. సినిమాల్లో భారీ డైలాగులకే కాదు.. వరల్డ్ ఫేమస్ షో బిగ్ బాస్ తొలి సీజన్ కు హోస్ట్ గా చేసి విజిల్స్ వేయించుకున్నాడు. టీవీల్లో కమర్షియల్ యాడ్స్ కూడా తన మార్క్ చూపించాడు. వెండితెర, బుల్లితెరల్లో రాణించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడని ఫిలిం నగర్ టాక్.

 


సినిమాల్లో టాప్ స్టార్ గా ఉన్నా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ నిర్మాణ రంగం వైపు అడుగులు వేయలేదు. దీంతో ఎన్టీఆర్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆయన ఈడు హీరోలు.. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్, నాని సినిమాలు చేస్తూ అందరూ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. సీనియర్ హీరోలకు కూడా సొంత బ్యానర్ లు ఉన్నాయి. సొంత బ్యానర్ ఉంటే రిస్కీ ప్రాజెక్ట్ అయినా.. పూర్తిస్థాయి నటనకు అవకాశం ఉండే పాత్రలు చేయోచ్చు. వ్యాపారపరంగానూ ఎదగడానికి అవకాశం ఉంటుంది. దీంతో.. ఎన్టీఆర్ అటువైపు అడుగులు వేయడానికి ప్రణాళికలు వేస్తున్నాడని అంటున్నారు.  

 


అభిమానులు కూడా ఈ న్యూస్ తో ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాతోనే నిర్మాణంలోకి అడుగుపెడతాడా.. తర్వాతి సినిమానా అనేది ఆయన నుంచి వచ్చే అఫీషియల్ న్యూస్ ను బట్టే ఉంటుంది. టెంపర్ తో తన నటలోని పవర్ చూపించి వరుస హిట్లు సాధిస్తున్నాడు. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ ఉత్సాహపరుస్తున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: