మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే జబర్దస్త్ కామెడీ షో కు గుడ్ బై చెప్పిన మాట తెలిసిందే. జబర్దస్త్ నిర్వాహకులతో ఉన్న బేధాల కారణంగానే బయటకు వచ్చానని యూట్యూబ్ లో ఒక వీడియో విడుదల చేశారు. అయితే బయట మాత్రం నాగబాబు రెమ్యూనరేషన్ కోసమే జబర్దస్త్ వీడినట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో జీ తెలుగు లో 'సరే సర్లే ఎన్నెనో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి' అనే కామెడీ షో ప్రోమో లో కనిపించారు.

ఇక ఈ కామెడీ షో తో పాటు లోకల్ గ్యాంగ్స్ అనే కామెడీ షో లో కూడా నాగబాబు ఉన్నారు. జీ తెలుగు లో ప్రసారం అయిన కార్యక్రమం లో యాంకర్ ప్రదీప్ "సర్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి.. అప్పట్లో మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమించారా" అంటే నాగబాబు ఏ బెరుకు లేకుండా సమాధానం చెప్పారు. "ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసాను.. అంతా ఛీ కొట్టేసారు. మనదంతా వన్ సైడ్ లవ్" అంటూ అక్కడున్న యాంకర్ ప్రదీప్ కి చెప్పేసాడు మెగా బ్రదర్ నాగబాబు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం తన మొహం కూడా చూసేవాళ్లు కాదని.. కానీ తాను మాత్రం అలా వెంటపడుతూనే ఉండేవాన్నని చెప్పుకొచ్చాడు. నాగబాబు సమాధానం విని అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వేసారు. ఆ అమ్మాయిలు ఇప్పుడు మీ పొజిషన్ చూసి కుళ్లుకుంటారేమో సర్ అంటూ ప్రదీప్ అనగానే.. మనకు అంతలేదులే స్వామి అంటూ తనపై తనే సెటైర్ వేసుకున్నాడు నాగబాబు.

మరి ఈ కార్యక్రమం లో చెప్పినట్టుగానే నాగబాబు ని 9 అమ్మాయిలు ఛీ కొట్టారా అంటూ సోషల్ మీడియా లో ఒకటే ట్రోలింగ్. ఏదిఏమైనా నాగబాబు చెప్పిన లవ్ స్టోరీ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. షో లో కొంతమంది అయ్యో పాపం అనుకోగా కొంత మంది మాత్రం ఘొల్లున నవ్వారు. జబర్దస్త్ కు పోటీగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: