ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘జాను’ మూవీకి సంబంధించి వస్తున్న తొలి టాక్ చాల విభిన్నంగా కనిపిస్తోంది. ఫీల్ గుడ్ మూవీగా ఆద్యంతం ఉదాత్తంగా తీయబడిన ఈ సినిమా చాల స్లోగా ఉందని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. దీనితో ఈ సినిమాలో నటించిన సమంత శర్వానంద్ లకు మంచి పేరు వచ్చినా ఎంత వరకు కమర్షియల్ గా ఈ మూవీ సక్సస్ అవుతుంది అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత సినిమాల నిర్మాతలు నిర్వహిస్తున్న సక్సస్ మీట్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక సినిమా విడుదల అయ్యేంత వరకు ఎంత ఎక్కువగా ప్రమోట్ చేసినా తాను ఉత్సాహంగా పాల్గొంటానని అయితే ఆ మూవీ రిజల్ట్ వచ్చిన తరువాత ఆ సినిమాను ఎంత కష్టపడి ప్రమోట్ చేసినా ఆ మూవీకి కలక్షన్స్ విషయంలో మేలు చేకూరుతుందని తనకు నమ్మకం లేదు అంటూ కామెంట్స్ చేసింది.


అంతేకాదు సినిమా విడుదల తరువాత వెంటనే రెండవ రోజునే నిర్వహించే సక్సస్ మీట్స్ గురించి తనకు సరైన అభిప్రాయం లేదని మరొక కామెంట్ చేసింది. అందువల్లన తాను వీలైనంత వరకు తాను ఆ సక్సస్ మీట్ కు రావడానికి పెద్దగా ఆసక్తి కనపరచనని అభిప్రాయపడింది. 


అయితే తాను సక్సస్ మీట్ కు రావడం వలన కనీసం ఆ సినిమాకు 10 టిక్కెట్లు అయినా అదనంగా వెళతాయి అన్న నమ్మకం ఏర్పడితే తాను నిర్మాత పిలవక పోయినా తాను సక్సస్ మీట్ కు వస్తాను అంటోంది. ప్రస్తుతం ‘జాను సినిమాకు వస్తున్న టాక్ ను బట్టి ఈ మూవీ మల్టీ ప్లెక్స్ సినిమాగా మారబోతున్న నేపధ్యంలో మరి కొద్ది రోజులలో జరగబోయే ‘జాను’ సక్సస్ మీట్ కు సమంత నిజంగా వస్తుందో రాదో చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: