‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ఏకంగా వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా పడటంతో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అన్న ఆలోచనలతో ఉన్న భారీ సినిమాల ప్లాన్స్ అన్నీ షాక్ కు గురి అయ్యాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కేవలం సింగిల్ హ్యాండెడ్ గా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ ను శాసిస్తే ఆ మూవీకి కేవలం సంక్రాంతి సీజన్ లో వచ్చే కలక్షన్స్ ఎంత అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు మొదలైపోయాయి. 


వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు సంబంధించి రాజమౌళి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మ్యానియా బాగా పని పనిచేసింది అంటారు. సంక్రాంతి టైమ్ లో ఈ రెండు సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా చూడటంతో కేవలం సంక్రాంతి సీజన్ ముగిసే సరికి ఈ రెండు సినిమాలకు 200 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ వచ్చి బాక్స్ ఆఫీసు కళకళలాడింది.


ఈమధ్య కాలంలో ఎప్పుడు లేనివిధంగా ఈ రెండు సినిమాలను చూడటానికి బుల్లితెరకు అతుక్కు పోయిన ప్రేక్షకులు కూడ బయటకు వచ్చి ఈ రెండు సినిమాలు చూడటంతో టాక్ తో సంబంధం లేకుండా ఈ రెండు సినిమాల బయ్యర్లు లాభాల బాట పట్టారు. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మే వ్యూహలో రాజమౌళి ఉన్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ సంక్రాంతి రేసుకు ఒక వారం ముందు తీసుకు వస్తే సంక్రాంతి ముగిసేలోగానే ఈ మూవీకి 300 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ తీసుకు రావచ్చు ఆలోచనలు వల్ల రాజమౌళి ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ ను సంక్రాంతి రేసులో ఉండే విధంగా ఒక సంవత్సరం ముందుగానే ప్రకటన ఇచ్చాడు అని అంటున్నారు. 


దీనికితోడు దిల్ రాజ్ ఈ మూవీని ఇప్పటి వరకు ఎవరు ఆఫర్ చేయని కనివిని ఎరుగని స్థాయిలో 75 కోట్లకు పైగా కేవలం నైజాం రేట్స్ ను అడుగుతున్నారు అని ప్రచారం చేయడం కూడ ఈ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మే వ్యూహంలో భాగం అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: