చిరంజీవి తనకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెపుతూ తాను ప్రస్తుతం ఒక సినిమా హీరోని మాత్రమే అని అనేక సార్లు క్లారిటీ ఇస్తున్నా చిరంజీవి వ్యూహాల పై సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ తరఫున ఏకంగా రాజ్యసభకు ఎంపిక చేస్తాడు అంటూ అనేక ఊహాగానాలు కూడ వచ్చాయి. 

 

‘సైరా’ విడుదల తరువాత చిరంజీవి సతీసమేతంగా జగన్  ఇంటికి వెళ్ళి కలిసి తన సినిమాను చూడమని ఆహ్వానించి నప్పుడు జగన్ చిరంజీవి పై చూపించిన గౌరవాన్ని అభిమానాన్ని పరిశీలించిన వారు మాత్రం రానున్న రోజులలో చిరంజీవి వైఎస్ఆర్ పార్టీలో చేరుతాడా అన్న సందేహాలు వచ్చేలా పరిస్థితులు దారి తీసాయి. ఈ సంఘటన జరిగి చాల రోజుల తరువాత ఇప్పుడు లేటెస్ట్ గా హడావిడి చేస్తున్న చిరంజీవి అభిమానుల ఐడి కార్డుల పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

 

చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో లక్షల స్థాయిలో అభిమానులు వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో ఏకీకృతం చేయడానికి చిరంజీవి అభిమానులందరికీ ఐడి కార్డులు ఇచ్చే పనులు ఈమధ్య మొదలు అయ్యాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా లేటెస్ట్ గా చిరంజీవి అభిమానులకు ఇచ్చిన ఐడి కార్డుల బ్యాక్ గ్రౌండ్ లో వైఎస్ఆర్ పార్టీ ఫ్లాగ్ కలర్స్ కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

 

దీనితో ఈ సంఘటన యాధృశ్చికంగా జరిగిందా లేకుంటే ఏదైనా వ్యూహంతో ఇలా ఐడి కార్డుల కలర్స్ ను ఎంచుకున్నారా అన్న విషయమై అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో చిరంజీవికి మళ్ళీ రాజకీయ రంగు పులుముతూ వస్తున్న కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఈ విషయాలను ఏమి పట్టించుకోకుండా చిరంజీవి తన సినిమాలు తాను చేసుకుంటూ తన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తూ తాను అందరివాడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: