సరిగ్గా మూడు పూటలు తినడానికి తిండి లేని ఎంతో మంది కమెడియన్లకు లగ్జరీ లైఫ్ ని జబర్దస్త్ షో ప్రసాదించిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వాస్తవానికి కమెడియన్లే తమకి జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చిందని ఎన్నో సందర్భాల్లో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నతల్లి మాకు జన్మనిస్తే జబర్దస్త్ ప్రోగ్రాం మేం గౌరవంగా బతికేలా చేసిందని అన్న కమెడియన్లు కూడా ఉన్నారు. కానీ గతంలో అలా అన్న హాస్యనటులే ఇప్పుడు ఆ షో గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు.




ఒకప్పుడు హోటల్లో కప్పులు కడుక్కున్న కిరాక్ ఆర్పీ జబర్దస్త్ షో ద్వారానే పాపులర్ అయ్యి ఇప్పుడు ఆ ప్రోగ్రాం గురించి తప్పుడు మాటలు మాట్లాడటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. తాను మాట్లాడే మాటలను వింటుంటే ఎవరికైనా తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రాంలో మూడేళ్లుగా ఉంటూ 300కు పైగా స్కిట్లు చేసిన కిరాక్ ఆర్పీ కొన్ని నెలల క్రితం జీ తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది షోకి మకాం మార్చాడు. జీటీవీ వాళ్లు పారితోషికం ఎక్కువ ఇస్తున్నారు కదా అని వెళ్ళిపోతే తప్పేం లేదు కానీ ఇన్నాళ్లు తల్లీ, తల్లీ అని జబర్దస్త్ షో ని పిలిచి అక్కడికి వెళ్ళిపోగానే తల్లిలాంటి షో పై తమ నోటికొచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు.



అతను ఇటీవల చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఇతగాడు జబర్దస్త్ గురించి మాట్లాడుతూ... లైఫ్ ఇవ్వడం అనేది ఒక పెద్ద పదమని... ఆ పదాన్ని ఎక్కడపడితే అక్కడ వాడకూడదని చెప్పాడు. లైఫ్ ఇవ్వడమంటే నువ్వు చేయలేవు అనుకున్న వాడిని కూడా ప్రోత్సహించి... ఒక పని చేయగలిగేలా చేయడమే లైఫ్ ఇవ్వడం అని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో ఎవరికి ఎవరు లైఫ్ ఇవ్వలేదని... తన టాలెంట్ తోనే తాను పైకి వచ్చానని... జబర్దస్త్ దాని అవసరం కోసం తనని వాడుకున్నదని... తనేమో జబర్దస్త్ అవసరాన్ని అవకాశంగా చేసుకుని కష్టపడ్డానని కానీ తనని ఎవరు పైకి తీసుకొచ్చేంత సినిమా జబర్దస్త్ లో లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం ఈయన వాక్యాలు వైరల్ అవుతున్నాయి. లేదనుకున్నా జబర్దస్త్ రోడ్డు మీద పడి ఉన్న నిన్ను ఆదరించి మంచి లైఫ్ ని ప్రసాదించింది. షో నచ్చకపోతే వెళ్లిపోవడం అనేది వేరే విషయం కానీ నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు పారేసుకోవడం నీ నీచమైన బుద్దిని తెలియజేస్తుంది అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: