సినీ పరిశ్రమలో ఏ రోజు ఎలా ఉంటాదో ఎవరికీ తెలీదు. స్టార్ డ్యామ్ ఉన్న హీరోలు కూడా ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలీదు. సినీ పరిశ్రమలో ఎలాంటి తోడు లేకుండా రాణించాలి అంటే చాల కష్టం. ఏ హీరో అయినా సినిమా విజవతం అయ్యేవరకు వేచి చూడాల్సిందే. హీరో నుండి విజయవంతమైన చిత్రాలు వచ్చినప్పుడు ఆ హీరో ఆటోమేటిక్ గా స్టార్ డమ్ పొందుతాడు.

 

హీరో అయినా స్టార్డమ్ కొనసాగించిన వారు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు మనుగడ సాధించగలరు. సినీ పరిశ్రమలో ఎలా ఉంటాదో అందరికి తెలిసిన విషయమే. కొంతమంది హీరోలు తమ అరంగేట్రంలో బ్లాక్ బస్టర్స్ సాధించి తరువాత రోజుల్లో సినీ పరిశ్రమ నుండి అదృశ్యమైన హీరో హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఎవరి సహాయం లేకుండా విజయం అయిన ఈ కాలం హీరోలో నాని ఒకరు మాత్రమే. నాని తన సహజమైన నటనతో అందరిని మెప్పించాడు. అంతే కాకుండా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. నాని వైవిధ్యమైన చిత్రాలలో భాగస్వామి అవ్వడమే దీనికి కారణం.

 

అందుకే నానిని అతని అభిమానులు నాచురల్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. నానితో పోలిస్తే యువ హీరోలు అందరు ఈ అంశంలోనే తడబడుతున్నారు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

మొదట చిన్న సైడ్ రోల్స్ చేస్తూ వచ్చాడు ఈ హీరో. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైయ్యాడు విజయ దేవరకొండ. విజయ్ కూడా సినీ పరిశ్రమలో ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాడే. మొదటి సినిమాతోనే విజయం సాధించాక విజయ్  'అర్జున్ రెడ్డి' - 'గీత గోవిందం' వంటి చిత్రాల విజయాలతో మంచి స్టార్ డమ్ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలను ఎంచుకునే విషయంలో కొంచం వెనక పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: