దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం షట్ డౌన్ ప్రకటించడంతో చాలామంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒక్కసారిగా అనుకోని విధంగా ఈ పరిస్థితి నెలకొనడంతో పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలు అల్లాడి పోతున్నారు. ఏప్రిల్ 14 వరకు పగడ్బందీగా భారతీయులు షట్ డౌన్ పాటిస్తే మొత్తం కేసుల నుండి బయట పడతాయి...ఒక ఐడియా ప్రభుత్వానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇండియాలో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ బాధితులకు మరియు ప్రభుత్వాలకు అండగా నిలబడటానికి చాలామంది ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం విధించిన షట్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు మరియు ప్రముఖులు భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించడం జరిగింది. బాహుబలి సినిమా తో అంతర్జాతీయస్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్లు మరియు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కోటి రూపాయలు ప్రకటించి మొత్తంగా కరోనా వైరస్ బాధితుల కోసం విరాళంగా 4 కోట్లు అందించారు.

 

పవన్ కళ్యాణ్ కూడా ఒక కోటి కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు రాష్ట్రాల కు చెరో 50 లక్షలు ప్రకటించారు. ఇదేవిధంగా అల్లు అర్జున్, నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు ఇంకా చాలామంది స్టార్ హీరోలు కరోనా వైరస్ ఈ విషయంలో ప్రభుత్వాలకు భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ లో హీరోల వాళ్లకి ఉన్న బుద్ధి బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలకి లేదే అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: