ఆర్ఎక్స్ 100 సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ శిశ్యుడిగా ఇండస్ట్రీకొచ్చిన అజయ్ భూపతి మొదటి సినిమా అయిన ఆర్ఎక్స్ 100 కోసం చాలా శ్రమించాడు. కేవలం టైటిల్ కోసమే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి తను అనుకున్న సినిమా టైటిల్ ని దక్కించుకున్నాడు. ఇక ఎలాంటి అంచానాలు లేకుండా వచ్చిన ఆర్ఎక్స్ 100 టాలీవుడ్ లో సూపర్ హిట్ ని సాధించింది. ఈ సినిమాతో హీరో కార్తికేయ, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ హీరోగా రెండు సినిమాలు, విలన్ గా ఒక సినిమా చేసేశాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

 

ఇక హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 తర్వాత ఒక ఐటం సాంగ్ చేసింది. హీరోయిన్ గా ఆర్.డి.ఎక్స్ లవ్, విక్టరీ వెంకటేష్ తో వెంకీ మామ, మాస్ మహారాజా రవితేజ తో డిస్కో రాజా సినిమాలు చేసింది. ఇలా దర్శకుడు అజయ్ భూపతి ఇచ్చిన క్రేజ్ తో అటు హీరో, ఇటు హీరోయిన్ నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నారు. కాని దర్శకుడు అజయ్ భూపతి కి మాత్రం మళ్ళీ సినిమా రాకపోవడం ఆశ్చర్యకరం. ఎంతగానో రెండవ సినిమాకోసం ప్రయత్నాలు చేసి అలసిపోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టు మహా సముద్రం. ఈ మహా సముద్రం తో అజయ్ కి చుక్కలు కనపడుతున్నాయి. 

 

ఈ సినిమాకి హీరోలు మారుతున్నారు... నిర్మాతలు మారుతున్నారు. అయితే మహా సముద్రం మాత్రం సెట్ మీదకు వెళ్లడం లేదు. ఇక ఈ మహా సముద్రం అనిల్ సుంకర చేతికి వచ్చిందని తాజా సమాచారం. అయితే ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. నిర్మాత, దర్శకుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయట. అయితే హీరో మాత్రం శర్వానంద్ అని అనుకుంటున్నారు. మరో హీరో ఎవరు అన్నది ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది. మరి ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి అందరూ కరోనా కట్టడిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: