కరోనా వైరస్ రోజు రోజుకీ మరింత విజృంభిస్తుంది. ఈ మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకి వైద్యం అందిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లోకి ఈ మహమ్మారి వచ్చి పూర్తిగా డిస్టర్బ్ చేసింది. మనిషి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించాడు.. కానీ ఈ కనిపించని పురుగుని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు.

 

ఈ మహమ్మారి దెబ్బకి ఆర్థికంగా బాగా చితికిపోయాం. ఉపాధి కోల్పోయి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక రోజువారి కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెక్కాడితే కానీ డొక్కాడనీ వీరి జీవితాలు అయోమయంగా తయారయ్యాయి. అయితే రోజువారి కూలీలకి ఆసరా అందించడానికి సమాజంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. రోజువారి సినీ కార్మికులకి సాయం చేయడానికి చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ చారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు.

 

ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ప్రతీ సినిమా ఇండస్ట్రీలోనూ ఇలాగే చేస్తున్నారు. వీరికోసం సాయం చేయడానికి సెలెబ్రిటీలు తమకి తోచిన విరాళాన్ని ప్రకటిస్తున్నారు. అయితే ఇలా విరాళాలు ప్రకటించిన వారిలో ఎక్కువ మంది హీరోలే ఉన్నారు. హీరోయిన్లలో చాలా తక్కువ మంది మాత్రమే స్పందించారు. అయితే కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ ఇలాంటి సమయంలో స్పందించకపోవడం కొంతమందికి నచ్చడం లేదు.

 

అందుకే వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా శృతి హాసన్ కి కూడా ఈ తాకిడి మొదలైంది. అయితే వీటికి బదులిస్తూ శృతి హాసన్, నాకొకరు చెప్తే నేనేదీ చేయను.. నాకు చేయాలనిపిస్తే చేస్తా. ఒకరి ఆదేశాలని పాటించడం నాకు నచ్చదు.. అయినా చాలా సార్లు చాలా మందికి నేను సాయం చేశానని చెప్పుకొచ్చింది. మరి ఈమె మాటలపై నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి: