హీరోయిన్లు ఎప్పుడూ రెండు, మూడు ఆప్షన్స్ రెడీగా పెట్టుకుంటారు. ఒకచోట అటు ఇటు అయినా.. మరో చోట నిలబడొచ్చనే ప్లాన్స్ లో ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ జిగేల్ రాణి కూడా ఇలాగే కోలీవుడ్ పై ఫోకస్ పెడుతోంది. తమిళనాట సూపర్ హీరోయిన్ అనిపించుకునేందుకు ట్రై చేస్తోంది. 

 

పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్ నుంచే మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని ఫోకస్ చేస్తోంది. తెలుగులో ముకుంద చేయగానే హిందీకి వెళ్లిపోయింది. అక్కడ హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో సినిమా చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కొన్నాళ్లు టాలీవుడ్ కు బ్రేక్ కూడా ఇచ్చింది. 

 

మొహంజదారో మిస్ ఫైర్ అవ్వడంతో పూజా మళ్లీ టాలీవుడ్ కు వచ్చేసింది. డీజేలో అందాల మోత మోగించి భారీ అవకాశాలు అందుకుంది. టాలీవుడ్ టాప్ ఛైర్ దగ్గరయింది. అయితే ఈ స్టార్డమ్ ని తమిళ్ కు విస్తరించాలనుకుంటోంది పూజా. కోలీవుడ్ లో ఓ సూపర్ హిట్ ఇచ్చే కథ కోసం సంప్రదింపులు జరుపుతోంది.  

 

విజయ్-మురుగదాస్ కాంబినేషన్ లో తుపాకి 2 రాబోతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు పూజాని హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ పూజా నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. అయితే పూజా తమిళ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళ్ లో మూగమూది సినిమాతో కెమెరా ముందుకొచ్చింది పూజా. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన కోలీవుడ్ లో క్వీన్ గా ఎదగాలనుకుంటోంది పూజ. మొత్తానికి పూజా హెగ్డే తమిళనాట సూపర్ హీరోయిన్ అనిపించుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. మార్కెట్ ను పెంచుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తోనే కొత్త అవకాశాలు ఎదురుచూస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: