మద్రాస్ లో సినిమా పరిశ్రమ ఉన్నపుడు అంతా విశాఖ వైపే చూసేవారు. అప్పట్లో పెద్ద ఎత్తున సినిమా షూటింగులు విశాఖ, భీమిలీ, అరకు వంటి చోట్ల జరిగేవి. నాటి ప్రముఖ దర్శకులు కె విశ్వనాధ్, కె బాలచందర్, దాసరి నారాయణరావు వంటి వారు విశాఖ వైపు చూసేవారు.

 

ఎన్నో అవుట్ డోర్ షూటింగులకు నిలయంగా విశాఖ, భీమిలీ ఎపుడూ కిటకిటలాడుతూ ఉండేది. మరో చిత్రమేంటంటే ఇక్కడ షూటింగు చేసుకున్న ప్రతీ చిత్రం హిట్ అయ్యేది. ఆ సెంటిమెంట్ తో కూడా చాలామంది ఇక్కడకు వచ్చేవారు.

 

ఇక మద్రాస్ నుంచి తెలుసు సినీ పరిశ్రమ తరలివస్తుందనగనే విశాఖకు షిఫ్ట్ అవుతుందనే అంతా భావించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా విశాఖ సినీ రాజధాని అవుతుందని కూడా అంచనా వేశారు. అయితే రాజధాని ఉన్నచోటకే వెళ్ళి టాలీవుడ్ స్థిరపడింది.

 

ఇక 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయింది. ఆ సమయంలో కూడా విశాఖకు సినీ రాజధాని వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో ఉన్న వారిలో నూటికి తొంబై శాతం మంది అంధ్రా వారే. అందువల్ల వారంతా విశాఖకు వస్తారని కూడా ఊహించారు.

 

అయితే దానికి భిన్నంగా తెలుగు సినిమా ఆరేళ్ళుగా హైదరాబాద్ లోనే ఉంది. ఇపుడు జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతోనే మళ్ళీ సినీ పరిశ్రమ మీద అందరి చూపు పడింది. విశాఖను రాజధాని చేద్దామనుకుంటున్న జగన్ దానితో పాటే సినీ రాజధానిగా చేయాలనుకుంటున్నారు.

 

ఈ నేపధ్యంలో ఆయన టాలీవుడ్ ప్రముఖులను మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో కలుస్తున్నారు. ఈ నెల 9న జరిగే ఈ భేటీలో విశాఖలొ సినీ పరిశ్రమ అభివ్రుధ్ధి అన్నది ప్రధాన అజెండాగా ఉంటుందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీకి, ఉత్తరాంధ్రాకు సినీ పండుగ వచ్చినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: