కొందరు చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాలకు సంబంధించిన సీన్స్ ఇంటర్నెట్ వరల్డ్ లో లీక్ చేస్తున్నారు. అయితే ఇటీవల అలాంటి చేదు అనుభవం దిల్ రాజు ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక సీన్ సోమవారం లీక్ అయిన విషయం అందరికి తెలిసిందే.

 


సినిమాకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఆ లీకేజ్ ఎక్కువ సేపు వైరల్ అవ్వకముందే దిల్ రాజు టీమ్ జాగ్రత్త పడింది. ఆ వీడియో వైరల్ అవ్వకముందే ఫ్యాన్స్ సాయంతో అరికట్టారు.

 

 

అయితే ఈ లీకేజ్ విషయంపై దిల్ రాజు చాలా సీరియస్ అయినట్లు సమాచారం. అసలు దీనికి కారకులు ఎవరనే విషయం గురించి కనిపెట్టడంలో బిజీగా ఉన్నాడు. అలాగే దిల్ రాజు పోలీసులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పుడు సిరియస్ గా తీసుకోకపోతే చాలా ప్రమాదమని దిల్ రాజు ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 

 

ఇప్పటికే షూటింగ్స్ పూర్తి చేయలేక సినిమా రిలీజ్ చేయలేక దిల్ రాజు చాలా ఇబ్బంది పడుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా తుది దశలో ఉన్న వకీల్ సాబ్ షూటింగ్ తో పాటి దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మరికొన్ని సినిమాలు కూడా చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయు. నాని v సినిమా రిలీజ్ డేట్ గత కొన్ని నెలలుగా మారుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

 

 

ఈ కష్టకాలంలో దిల్ రాజుకి మళ్ళీ మరో దెబ్బ పడటం చర్చనీయాంశంగా మారింది. ఇక వకీల్ సాబ్ కి సంబంధించి ఇంకా 20శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యుండేది. ఇక థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి వకీల్ సాబ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: