పండుగ వచ్చింది అంటే ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల సందడి మొదలైనట్టే. ఈటివిలో జబర్దస్త్ కమెడియన్లతో చేసే స్పెషల్ షో అదిరిపోతుంది. అయితే ఈ దసరాకి ప్లాన్ మారింది. ఈసారి స్టార్ మాలో పండుగ సందడి కనబడుతుంది. ఓ పక్క బిగ్ బాస్ తో బీభత్సం సృష్టిస్తున్న స్టార్ మా ఇప్పుడు దసరా రోజు జాతరో జాతర షోతో దుమ్ముదులిపేస్తుంది. స్టార్ మాలో నంబర్ 1 సీరియల్ కార్తికదీపం లీడ్ పెయిర్ తో ఈ షో నడుస్తుంది.

ఇక యాంకర్ రవి, బాబా భాస్కర్ మాస్టర్, జ్యోతి కనిపించారు. వీరే కాకుండా కొత్తగా జబర్దస్త్ కమెడియన్లు కూడా ఈ స్పెషల్ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పుడు పండుగ వచ్చినా జబర్దస్త్ కమెడియన్లు కేవలం ఈటివి షోలకే పరిమితమయ్యే వారు కాని ఈసారి కొత్తగా స్టార్ మా ఈవెంట్ కు వచ్చారు. ఇంతకీ స్టార్ మా ఈవెంట్ లో కనిపించిన జబర్దస్త్ కమెడియన్లు ఎవరంటే చలాకీ చంటి, బుల్లెట్ భాస్కర్, సునామి సుధాకర్, పొట్టి నరేష్ కనిపించారు  

వీరు జస్ట్ షోకి మాత్రమే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారా లేక వీరు కూడా అవినాష్ లాగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారా అన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క ఈటివిలో కూడా అక్క ఎవరే అతగాడు షో దసరా కానుకగా చేశారు. అందులో నవదీప్, సుధీర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. దసరా షోలలో ఏది సూపర్ హిట్ అవుతుందో చూడాలి.                                                          


మరింత సమాచారం తెలుసుకోండి: