ఓ మలయాళ టీవీ ప్రోగ్రాంలో చిన్నపాటి యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నయనతార ఆ తర్వాత ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని సినిమా రంగంలో నిలదొక్కుకొని లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. చీరకట్టు అందాలతో.. ముచ్చటైన అభినయంతో దక్షిణ భారతదేశ ప్రజలందరినీ వెండితెరకు కట్టిపడేసిన ఏకైక హీరోయిన్ గా నయనతార నిలించారంటే అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించిన నయనతార ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కర్తవ్యం వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అత్యద్భుతంగా నటించి సినిమాలను విజయ తీరాల వైపు నడిపించారు.


అయితే ప్రస్తుతం నయనతార కెరీర్ లో అన్ని ప్రయోగాత్మక చిత్రాలే తెరకెక్కుతున్నాయి. మూకుత్తి అమ్మన్‌ చిత్రం లో అమ్మవారి పాత్రలో నటిస్తున్న నయనతార సమంత అక్కినేని కీలక పాత్రలో నటిస్తున్న కాతు వాకులా రేండు కదల్ సినిమాలో కూడా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాను మినహాయించి తన ప్రియుడైన విఘ్నేష్‌శివన్‌ నిర్మిస్తున్న నెట్రికన్‌ సినిమాలో ఒక చాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. మిలింద్‌రావ్‌ దర్శకత్వం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార అంజలి గా కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవలే నెట్రికన్ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. ప్రస్తుతానికి తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి కాగానే తెలుగులో డబ్ కాబడుతుంది అని సినిమా బృందం తెలిపింది.


నయనతార కుంచాకో బోబన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "నిజాల్" సినిమాలో నటించనున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాతే సినిమాలో కూడా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా ఆమె ఒక క్లిష్టమైన పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.  నిజాల్ అనే థ్రిల్లర్ సినిమాలో నయనతార అది చాలా భిన్నమైన పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే నయనతార తన తదుపరి అన్ని సినిమాల్లో కూడా ప్రయోగాత్మక పాత్రలనే పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: