యంగ్ రెబల్ స్టార్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అలరించగా లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్పోస్టర్ వచ్చింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఏ సినిమా అయినా కూడా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే దారిలో ప్రభాస్ రాధే శ్యామ్ కూడా వస్తుంది. సినిమాలో ప్రభాస్ తో పాటుగా పూజా హెగ్దేకి సూపర్ క్రేజ్ వచ్చేలా ఉంది. తప్పకుండా పూజా హెగ్దేకి ఈ సినిమా కెరియర్ బెస్ట్ ఇచ్చేలా ఉంది. బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి ఈ సినిమా స్పెషల్ క్రేజ్ తెచ్చేలా ఉంది. ఆల్రెడీ పూజా హెగ్దే బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.

అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెంకపడ్డ అమ్మడు రాధే శ్యామ్ తో తప్పకుండా క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు. సినిమాలో ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్దే డ్యుయల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో పూజా హెగ్దే మాత్రం చాలా క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది. మరి పూజాకు రాధే శ్యామ్ ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి.                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: