ప్రజల అభిమానంతో సెలెబ్రెటీలుగా ఎదిగిన వారందరికీ సామాజిక బాధ్యత చాల ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు ఏదైనా విపత్తు సంభవించినప్పుడు జనం అంతా ప్రభుత్వం నుండి సహాయం ఆశిస్తూనే తాము చూపెట్టిన అభిమానంతో కోట్లు గణించుకున్న సినిమా సెలెబ్రెటీలు ప్రకృతి విపత్తులతో సతమతమైపోతున్న తమకు ఎలాంటి సహాయాలు సినిమా సెలెబ్రెటీలు అందిస్తారు అంటూ ప్రజలు ఎదురు చూడటం ఒక పరిపాటిగా మారింది.


ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసిన వరదల కష్టాలకు నష్టపోయిన సామాన్య జనాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాల పిలుపు మేరకు అనేకమంది ఫిలిం సెలెబ్రెటీలు భారీ స్థాయిలో విరాళాలు అందచేసారు. ఈవిషయమై పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.


ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జనం అభిమానంతో ఎదిగిన సినిమా సెలెబ్రెటీలు విరాళాలు ఇవ్వవలసిన నైతిక భాద్యత తమకు ఉన్నప్పటికీ తమతోపాటు ఎన్నికలు వచ్చాయి అంటే చాలు కొట్లాది రూపాయలను చిత్తు కాగితాలు లా పంచిపెట్టే అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు తమ సొంత డబ్బుతో ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత లేదా అంటూ పవన్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. అంతేకాదు అందరు అనుకున్నట్లుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారు అంతా వేల కోట్లకు అధిపతులు కారనీ కొట్లాదిరూపాయలలో వడ్డీలు కడుతున్న అనేకమంది నిర్మాతలు నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు అంటూ కామెంట్ చేసాడు.


వాస్తానికి పవన్ చేసిన కామెంట్స్ లో కొంతవరకు నిజాలు ఉన్నా జనం దృష్టిలో మటుకు సినిమా సెలెబ్రెటీలు అంటే వందల కోట్లకు అధిపతులు అన్న భావం ఇప్పటికీ జనంలో ఉంది. గతంలో తెలుగువారికి ఆపదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి జనం మధ్యకు వెళ్ళి జోలి పట్టుకుని విరాళాలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ సెలెబ్రెటీలు మాత్రం ఇలా జనంలోకి వెళ్ళే ఓపికలేక కేవలం తమవంతు సహాయంగా కొంత భారీ మొత్తాన్ని ఇచ్చి ఆ మొత్తం పై ట్యాక్స్ ప్రయోజనాలు కూడ పొందుతూ తమకు కూడ సామాజిక బాధ్యత ఉంది అని చెప్పుకుంటూ అడుగులు వేస్తున్నారు అన్నది నిజం..  

మరింత సమాచారం తెలుసుకోండి: