ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో  దూసుకుపోతుంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4. బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ టీవీ లకు కట్టిపడేస్తుంది. మనకు తెలిసిన సెలబ్రిటీల గురించి మనకు తెలియని విషయాలను ప్రేక్షకులందరికీ తెలిపేందుకు ప్రస్తుతం బిగ్ బాస్ షో  దాదాపు 16 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదట ప్రేక్షకులను బిగ్ బాస్ షో ఆకట్టుకోలేకపోయినప్పటికీ  ఆ తర్వాత మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీస్  కాంట్రవర్సీలు మొత్తం తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి అని చెప్పాలి.



 ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఒక వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ చేసే సందడి.. ఇక వారాంతంలో నాగార్జున వచ్చి చేసే  సందడి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ లో ప్రతీ వారం ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ బయటికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక హౌస్ నుంచి ఎవరు బయటకు రావాలి అన్నది కూడా పూర్తిగా ప్రేక్షకుల ఓట్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.



 అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన ఫిట్నెస్ తో తన అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  దివి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లో ఉన్న అందరిలో మోనాల్, దివికి తక్కువ ఓట్లు రాగా దివి కంటే  మోనాల్ కు  ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది  దీంతో ఈ వారం దివి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: