తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని దర్శక నిర్మాతలు అందరి చూపులు తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసి మరో బ్లాక్ బస్టర్ ను  తన ఖాతాలో వేసుకుంది. అటు వెంటనే భీష్మ తో మరియు సూపర్ హిట్ ను సాధించింది రష్మిక మందన.



 ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప అనే సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్మగ్లింగ్  నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర డిఫరెంట్ లుక్ లో ఉండడంతో రష్మిక మందన్న పాత్ర ఎలా ఉండబోతుందో  అని అభిమానులు  ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక అంతే కాకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన చిలిపి నవ్వుతో ఆకర్షణీయమైన ఆటిట్యూడ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మిక మందన.



 ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో కోలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు ఇటీవల తెలిపింది. కార్తీ హీరోగా నటిస్తున్న సుల్తాన్ సినిమా ద్వారా కోలీవుడ్లో అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఇటీవలే రష్మిక మందన తెలిపింది.  తాను తన తండ్రితో కలిసి చిన్నప్పటినుంచి తమిళ సినిమాలు చూసేదాన్ని అంటూ తెలిపిన రష్మిక మందన్న ఇక ఇప్పుడు ఏకంగా తమిళ ఇండస్ట్రీ లో నటించేందుకు అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. గొప్ప వ్యక్తులతో నటించడం ఆనందంగా ఉంది అని చెప్పుకోచ్చింది రష్మిక మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: