క్రేజీ ఇమేజ్ తో యూత్ లో తనకు తానే పోటీ అనే రీతిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.ఆయన ప్రస్తుతం డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోన్నాడు.ఈ సినిమాకు ఫైటర్ అనే పేరు పరిశీలనలో వుంది.ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో వుంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని తెలుస్తుంది.

డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా మలయాళ హీరో సురేష్ గోపి కనిపించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అసలు సురేష్ గోపి అంటే తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు గానీ, మలయాళంలో ఆయన ఒకప్పుడు మంచి నటుడు. తమిళనాట కూడా సురేష్ గోపికి మంచి గుర్తింపు ఉంది.. తండ్రికొడుకుల మద్య వచ్చే ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయని తెలుస్తోంది.

 ముఖ్యంగా విజయ్ దేవరకొండసినిమా కోసం తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడని తెలుస్తుంది..చిన్న హీరోలకు సైతం విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చే పూరీ గారు విజయ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: