కె రాఘవేంద్రరావు బీఏ. నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి టాప్ స్టార్స్ బొమ్మల‌ పోస్టర్లతో పాటు ఈ పేరు కూడా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా చూసేవారు. ఫలనా హీరో రాఘవేంద్రరావు కాంబో అంటే ఇక ఆ హీరో దశ తిరిగింది అని లెక్క వేసుకునేవారు. వరస హిట్లతో బ్లాక్ బస్టర్లతో రాఘవేంద్రరావు టాలీవుడ్ కి అప్పట్లో  కనక వర్షాన్నే కురిపించారు.

ఆయన తాను హాఫ్ బిట్ మూవీస్ తీస్తాను, సందేశాలు చెబుతాను, సంగీత ప్రధాన చిత్రాలు తీస్తాను అని మడికట్టుకుని కూర్చోలేదు. పక్కా కమర్షియల్ ఫార్ములానే నమ్ముకున్నారు. తనను నమ్మి వచ్చిన నిర్మాత ఒడిలో కాసులు గలగలలాడడమే తనకు ముఖ్యం అనుకున్నారు. అందుకే అంత లాంగ్ కెరీర్ ఆయన సొంతం అయింది. అంతే కాదు ఆయన హీరోలు కూడా సూపర్ స్టార్లు అయి పదికాలల సరిపడా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆలా తెలుగు సినిమా కూడా మంచి దశను చూసింది.

ఇక రాఘవేంద్రరావు హీరోగా ఒక సినిమా అని తాజాగా ప్రచారం సాగుతోంది. ఏమా కధా అంటే అది కూడా ఇంటెరెస్టింగ్ స్టోరీయే అంటున్నారు. అరవయ్యేళ్ళు దాటి సర్కార్  ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన పాత్రతో రాఘవేంద్రరావు కనిపిస్తారట. ఆ మూవీలో రాఘవేంద్రుని పక్కన హీరోయిన్ గా రమ్యక్రిష్ణ నటిస్తుందిట.

ఈ సీనియర్ సిటిజన్ కి మరి లవ్ ట్రాక్స్ పెడతారో, ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారో తెలియదు కానీ గ్లామర్ డోస్ కూడా ఈ సినిమాలో ఉంటుందిట. ఇద్దరు అందాల భామలు గెస్ట్ రోల్స్ లో కనిపించి రాఘవేంద్రునితో ఆడి పాడతారా అన్నది చూడాలి. ఆ ఇద్దరూ సమంత, శ్రీయ అనుకుంటున్నారు. మొత్తానికి ముగ్గురు అందమైన భామలతో రాఘవేంద్రుడు ఫస్ట్ టైం హీరోగా మూవీ అంటున్నారు. మార్చిలో మొదలయ్యే ఈ సినిమాకు కధ దర్శకత్వం ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి నిర్వహిస్తాడు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: