అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తీస్తున్నాడు. రంగ స్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సుకుమార్ చేస్తున్న‌ మూవీ ఇదే. ఇక అల వైకుంఠపురంలో మూవీ వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ చేసిన అల్లు అర్జున్ పుష్ప మూవీతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. దాంతో గ్యారంటీ హిట్ అని బన్నీ ఫ్యాన్స్ లెక్క వేసేశారు.

ఆ తరువాత మూవీ ఏంటి అన్నది కూడా అందరిలోనూ చర్చగా ఉంది. అయితే బన్నీ వెంటనే కొరటాల శివకు డేట్స్ ఇచ్చేశాడని టాక్. ఈ ఇద్దరి కాంబోలో అద్భుతమైన కధతో మూవీ రానుందని అంటున్నారు. స్టూడెంట్ లీడర్ గా ఈ మూవీలో అల్లు అర్జున్ కనిపిసాడు అంటున్నారు. అంటే బన్నీ  పవర్ ఫుల్ రోల్ తో పాటు మేసేజ్ కూడా గట్టిగానే ఉంటుంది మరి.

ఇటు అల్లు అర్జున్ స్టైల్ ని కవర్ చేస్తూ అటు కొరటాల శివ మ్యాజిక్ కూడా ఈ మూవీలో ఉంటుందని అంటున్నారు. ఈ మూవీకి హీరోయిన్ ని సెలెక్ట్ చేశారన్నదే తాజా టాక్. సాయి ముంజ్రేక‌ర్ ఈ మూవీలో బన్నీతో ఆడి పాడనుంది అంటున్నారు. ఈ అమ్మడు కోసం ఇప్పటికే ఎన్నో కధనాలు టాలీవుడ్ లో వచ్చాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీలో ఆమె ఒక హీరోయిన్ అనుకున్నారు. కానీ ఇపుడు అటూ ఇటూ తిరిగి బన్నీ మూవీలో ఆమె హీరోయిన్ అంటున్నారు.  ఈ జంట కన్నుల పంట పండిస్తుంది అంటున్నారు. చూడాలి మరి 

మరింత సమాచారం తెలుసుకోండి: