బాహుబలి సినిమాతో దర్శకుడిగా ఎవ్వరికీ అందనంత స్థాయికి చేరిపోయాడు రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించాడు మన జక్కన్న.. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించడానికి సిద్ధమై టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో rrr అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు.. భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఇద్దరు పోరాట యోధులు, మన్యం ప్రజల కోసం పోరాడిన ధీరులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.

 ఈ వీరులకు కల్పిత కథను జతచేసి ఓ అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.కాగా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో చిత్ర రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర రిలీజ్ డేట్ ను లీక్ చేసి షాక్ ఇచ్చింది.ఈ సినిమాలో బ్రిటిష్ లేడీ స్కాట్ గా నటిస్తున్న ఆంగ్ల నటి అలిసన్ డూడి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో rrr రిలీజ్ డేట్ అక్టోబర్ 8 న అన్నట్టుగా ఇటీవల మేకర్స్ పెట్టిన క్లైమాక్స్ షూట్ ఫోటో పెట్టి రివీల్ చేసేసింది.
 
అయితే ఇది ఎంతో సేపు ఉంచకుండా మళ్ళీ నార్మల్ ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. కానీ అప్పటికే ఆ పిక్ వైరల్ గా మారింది.
దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్..RRR రిలీజ్ డేట్ అక్టోబర్ 8 కి కన్ఫర్మ్ అయినట్లు పలు పోస్ట్ లను తెగ ప్రచారం చేస్తున్నారు.. దీనికి తోడు మెగా,నందమూరి అభిమానులు ఏకమవ్వడంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి నిజంగా ఈ సినిమా అక్టోబర్ 8 కి విడుదలైతే మాత్రం.. రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న యావత్ rrr ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: