ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు సర్వసాధారణం అయిపోయాయి. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల వాళ్ళు హక్కుల కొనుక్కుని మరీ రీమేక్ చేస్తున్నారు. మన తెలుగు సినిమాలను చాలా భాషల వాళ్ళు కొనుక్కుని మరీ రీమేక్ చేస్తూంటే మన వాళ్లు కూడా ఇతర భాషల నుంచి సినిమాలు కొనుక్కుని ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. అయితే 2017 లో రిలీజ్ అయిన విక్రమ్ వేద అనే సినిమాకి తమిళంలో బాగా క్రేజ్ వచ్చింది. తమిళ హీరోలు మాధవన్ అలాగే లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ సేతుపతి ఇద్దరూ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పుష్కర్, గాయత్రి అనే దర్శకద్వయం తెరకెక్కించిన ఈ సినిమా 2017లో విడుదల అయి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 

ఈ సినిమాని తెలుగులో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం చాలా సార్లు జరుగుతూ వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాజశేఖర్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారని ఒకసారి, పవన్ కళ్యాణ్ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారని ఒకసారి ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. అంతే కాదు ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం గోపాల గోపాల దర్శకుడు డాలి దక్కించుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని తెరకెక్కించే సరైన దర్శకుడి కోసం రవితేజ ఇప్పుడు వెతుకులాటలో పడ్డాడట.

 క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఆయన డాలీ ఈ కథను డీల్ చేయగలడా లేదా అని ఆలోచనలో పడ్డాడట. అందుకే ఈ సినిమాను తెరకెక్కించే సరైన దర్శకుడి కోసం ఆయన వెతుకుతున్నాడు అని చెబుతున్నారు. అయితే గతంలో కూడా ఇలాగే ఈ సినిమా తెలుగు రీమేక్ కి సంబంధించి అనేక పుకార్లు షికారు చేయగా ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన వైనాట్ స్టూడియోస్ బాలకృష్ణ అలాగే రాజశేఖర్ ఈ సినిమాలో నటించడం లేదని ఈ సినిమా తెలుగు రైట్స్ ఇంకా తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఇప్పుడు సరైన దర్శకుడు దొరికితే రవితేజ రైట్స్ కొనుక్కుని పని మొదలు పెడతాడు ఏమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: