ఈ మధ్యకాలంలో విశాల్ టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు. స్వతహాగా తెలుగువాడు కావడంతో ఎక్కువగా తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు విశాల్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆయన ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ వరకూ అంతగా ప్రస్తుతానికి బాలేదు. ఆయన పెళ్లి క్యాన్సిల్ కావడం, నడిగర్ సంఘం గొడవలు, తాజాగా ఆయన నుంచి రిలీజ్ అయిన చక్ర సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో ఆయన ఈసారి కాస్త భిన్నంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన ప్రస్తుతం ఎనిమీ అనే సినిమాతో పాటు తుప్పరివాలన్ అంటే తెలుగులో డిటెక్టివ్ అనే పేరుతో రిలీజ్ అయిన సినిమాకు అదే పేరుతో సెకండ్ పార్ట్ సీక్వెల్ చేస్తున్నాడు. 

ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఆయన తెలుగులో ఒక స్టార్ హీరో తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఆయన ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేసి చాలా ఏళ్లయింది. ఈ నేపథ్యంలో తెలుగులో క్రేజ్ ఉన్న హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయాలని విశాల్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఆ హీరో ఎవరు అనే అంశం వెలుగులోకి రాకపోయినా క్రేజ్ ఉన్న హీరో తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి కథ సిద్ధం చేస్తున్నారని కథ పూర్తయ్యాక హీరోలను ఒప్పించే పనిలో ఉంటాడని అంటున్నారు. ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ తెలుగు హీరోకి మార్కెట్ ఉంటుంది, తమిళంలో తనకు మార్కెట్ ఉంటుంది అలా ఈ రెండు మార్కెట్లు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడతాయి అన్ని విశాల్ లెక్కలు వేసుకుంటున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: