తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ హీరోలు నుండి వెండితెరకు పరిచయమైయ్యారు. అందులో కొంత మంది హీరోలకి మాత్రమే మంచి గుర్తింపు ఉంది. ఇక ఆ ఫ్యామిలి నుండి వచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రెస్ బోయపాటి శ్రీను. ఆయన యాక్షన్ సినిమాలను చిత్రీకరించడంలోనూ, డైలాగ్ చెప్పడంలోనూ దిట్ట. ఆయన సినిమా అంటేనే ఓ రేంజ్ లో ఉంటాది. ఇక ఎన్టీఆర్, బాలయ్య బాబుతోను ఈయన సినిమాలను చిత్రీకరించారు. అయితే ఇప్పుడు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కళ్యాణ్ రామ్ చిత్రం చేస్తున్నారని.. ఇక ఇండస్ట్రీలో ఓ కొత్త కాంబినేషన్ సెట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

అయిత్ బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత సినిమా ఏమిటి ? కాగా తాజాగా తన తరువాత సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తో బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదూ అల్లు అర్జున్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. కానీ బోయపాటి శ్రీను కళ్యాణ్ రామ్ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కు సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్బోయపాటి కాంబినేషనైనా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: