మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ ఎక్కువగా మాస్ యాంగిల్ సినిమాలలో నటిస్తున్నాడు.. దీనితో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు మెగా స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ తన నటనతోనే కాకుండా డాన్స్, కామెడీ టైమింగ్ తో కూడా అందరినీ అలరిస్తూ ఉంటారు. ఇక రామ్ చరణ్ తన చిన్నతనంలో నటించిన ఒక ఫోటో వైరల్ గా మారింది . అది ఏ సినిమాలో చూద్దాం.
రామ్ చరణ్ మొదటి సినిమా ఏదంటే ఠక్కున "చిరుత" అని చెబుతారు. అయితే రామ్ చరణ్ 30 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలో నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. దర్శక ధీరుడు దాసరి నారాయణరావు, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన లంకేశ్వరుడు మూవీలో రామ్ చరణ్ ఒక పాత్రలో నటించాడు.. కానీ అందులో ఆ సన్నివేశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఎడిటింగ్ లో  తీసేయడం జరిగింది.
ఆ సీన్ కాస్త కట్ చేయకుండా ఉండుంటే, రామ్ చరణ్ మొదట నటించిన సినిమా ఇదే అయ్యేదేమో. ఇక సినిమా తరువాత తను ఇక ఏ సినిమాలో కూడా బాలనటుడుగా నటించలేదు. ఇదిలా ఉండగా వీరిద్దరూ కలిసి ఆచార్య సినిమాలో కొరటాల శివ డైరెక్షన్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఇక అంతే కాకుండా రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కు  సంబంధించిన ఒక టీజర్ విడుదల కాగా, ఇప్పటివరకు ఏ టీజర్ కూడా సాధించని మిలియన్ వ్యూస్ సృష్టించి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం 2021 డిసెంబర్ 14 విడుదల కానుంది.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన డైరెక్షన్ లో ఒక షార్ట్ ఫిలిం కూడా తీయబోతున్నారు. ఇక ఇప్పుడు ఉపాసన కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో అందరి కన్నులు వీరిపైనే..


మరింత సమాచారం తెలుసుకోండి: