వైవిధ్య దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో రెండవ చిత్రంగా వచ్చిన "అమ్మాయిలు అబ్బాయిలు" సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా విభిన్నమైన కామెడీతో, మంచి పాటలతో 2003 జనవరి 30 తేదీన విడుదలై రవి బాబు కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ ప్రసాద్ గా నటించిన విజయ్ సాయి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. ఈ చిత్రంలో విజయ్ సాయి కి ఎదురు రొమ్ము మీద మాత్రమే జుట్టు ఉండి మిగతా ప్రదేశం లో ఎలాంటి చుట్టూ ఉండదు. ఈ సమస్య కూడా అతడిని బాధిస్తుంటుంది. ఈ సినిమాలో విజయసాయి ని ప్రేమించే అమ్మాయి గా స్వప్నమాధురి నటించారు. చేతబడి చేసే మాంత్రికురాలుగా ఆమె కూడా ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచింది.


అల్లరి సుభాషిణి కామం తో రగిలిపోయే కామేశ్వరి పాత్రలో నటించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ఆమె ఈ చిత్రంలో ధరించిన కాస్ట్యూమ్స్ కూడా చాలా హాస్యాస్పదంగా కనిపించాయి. కృష్ణ భగవాన్, చలపతిరావు, లక్ష్మీపతి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితర కమెడియన్లు ఈ సినిమాలోని కామెడీ డోస్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక సోనూ సూద్ ప్రతినాయకుడిగా మంచి పర్ఫామెన్స్ చూపించి బాగా అలరించారు.



మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కంపోజ్ చేసిన పాటలు, ప్రసన్న అందించిన సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రధాన పాత్రల మధ్య చోటుచేసుకునే ప్రేమాయణం ఈ సినిమాని ఆసక్తికరంగా మార్చించి. దర్శకుడు రవిబాబు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాని హాలీవుడ్ స్టయిల్ లో రూపొందించారు. దీంతో ఇప్పటికీ ఈ సినిమా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పటి కామెడీ సినిమాలతో పోలిస్తే "అమ్మాయిలు అబ్బాయిలు" సినిమా రెట్టింపు స్థాయిలో నవ్వు తెప్పిస్తుంది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకపోయినట్లయితే.. త్వరగా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: