విక్టరీ వెంకటేష్ తీసిన ఎన్నో రీమేక్ సినిమాల్లో ఒకటి ఘర్షణ. కాకపోతే ఈ సినిమాలో ఆయన నటన మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన కాక్క కాక్క  సినిమా నచ్చి వెంకటేష్ తెలుగులోకి రీమేక్ చేశారు. అయితే పేరుకి ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ  మనకు ఎక్కడ ఆ ఛాయలు కనిపించవు. తమిళంలో సూర్య చేసిన పాత్రని తెలుగులో వెంకటేష్ చేశారు.
డీసీపీ రాం చంద్ర పాత్రలో ఆయన ఒడిగిపోయారనే చెప్పాలి. ఇక ఘర్షణ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆసిన్ కి తెలుగులో ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది.ఆమె మాయ పాత్రలో నిజంగానే అందరిని మాయ చేసింది అని చెప్పాలి. అలాగే ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పాట ఇప్పటికి తెలుగు జనాల ఫెవేరేట్ . మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ కి తెలుగులో ఒక్క హిట్ సినిమా లేకపోయినా కూడా పాటల ఆల్బమ్ పరంగా ఆయనవి సాంగ్స్ అన్ని సూపర్ హిట్టే." చెలియా చెలియా" , "నన్నే నన్నే చూస్తూ" ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాటలు వినడానికి చూడటానికి సూపర్ గా ఉంటాయి.
డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి తమిళంలోనూ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ప్రేమకథలకి తియ్యడంలో దిట్ట అని చెప్పాలి. అలాగే ఈ ఘర్షణలో కూడా సీరియస్ పోలీస్ స్టోరీని డివేర్ట్ చేయకుండా మంచి ప్రేమ కథని అందులో పెట్టరు. అలాగే విలన్ కూడా సినిమాలో మంచి మార్కులు కొట్టేస్తాడు. అయితే ఇన్ని మంచి అంశాలు ఉన్న ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా హిట్ అవ్వలేదు. దానికి కారణం అప్పట్లో నడుస్తున్న కామెడీ ఎంటర్టైమెంట్ ఈ సినిమాలో అసలు లేకపోవడం అనుకుంటా. అయితే తెలుగులో మాత్రం టాప్ పోలీస్ చిత్రాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: