లోకనాయకుకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన చాలా సినిమాలు నటించినప్పటికీ అందులో భారతీయుడు సినిమా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాకి డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం నిర్మించారు. అంతేకాదు.. ఈ మూవీకి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా ‘ఇండియన్’, ‘భారతీయుడు’ దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తెలుగునాట కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా మరింత విజయం సాధించి ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. అయితే శంకర్ తొలిసారి కమల్ హాసన్ వంటి స్టార్ యాక్టర్ తో పనిచేయడంతో మొదటి నుంచీ ‘భారతీయుడు’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ‘భారతీయుడు’ చిత్రానికి ముందు శంకర్ ‘జెంటిల్ మేన్’, ‘ప్రేమికుడు’ చిత్రాలను మాత్రమే రూపొందించారు. ఇక ఈ రెండు సినిమాలు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో సేనాధిపతి ముసలివాడైన తరువాతి గెటప్ చూసి ఎంతోమంది ప్రఖ్యాత తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి లాగా భావించారు. అయితే కమల్ హాసన్ గెటప్స్, అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కాగా, శంకర్ దర్శకత్వం రెండవ స్థానం ఆక్రమిస్తుంది.

అయితే అంతకు ముందు తమిళ, తెలుగు భాషల్లో కలిపి రజనీకాంత్ ‘బాషా’ పలు రికార్డులునెలకొల్పారు. ఇక ఆ రికార్డులను ‘భారతీయుడు’ బ్రేక్ చేసింది. ఇక మళ్ళీ రజనీకాంత్ ‘చంద్రముఖి’ దాకా ఈ సినిమా రికార్డులే పదిలంగా  ఉంచాయి. ఈ సినిమాకి  మూడు నేషనల్ అవార్డులు అందుకుంది. అయితే ఈ చిత్రానికి ఉత్తమ నటునిగా కమల్ హాసన్, ఉత్తమ కళాదర్శకునిగా తోట తరణి, విజువల్స్ ఎఫెక్ట్స్ లో ఎస్.టి.వెంకీ జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: