దర్శకుడు శ్రీను వైట్ల మహేష్ కాంబినేషన్ ఎప్పుడు ఆసక్తికరమే.. ఎందుకంటే వీరి కాంబినేషన్లో వచ్చిన దూకుడు సినిమా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ నమ్మకంతోనే మహేష్ బాబు శ్రీను వైట్ల కు మరొక సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి చేసిన ఆగడు అనే సినిమా భారీ ఫ్లాప్ ను ఎదుర్కుంది. మహేష్ బాబు నమ్మకాన్ని నిలబెట్టుకో లేకపోయాడు శ్రీనువైట్ల. నిజానికి ఆ సమయంలో శ్రీను వైట్ల టైం బాగాలేదు. ఎన్టీఆర్ తో బాద్ షా, రామ్ చరణ్ బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్ వంటి సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. దాంతో శ్రీనువైట్ల తనకు ఉన్న నమ్మకం కోల్పోయాడు అని అప్పట్లో ప్రేక్షకులు అన్నారు.

దాంతో ఈసారి వస్తే హిట్ సినిమాతో రావాలని చాలా టైమ్ తీసుకుని మరీ తన హిట్ చిత్రమైన ఢీ సినిమాకు కొనసాగింపుగా ఢీ & ఢీ అనే సినిమా చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అయిన ఈ సినిమా తో మళ్లీ శ్రీను వైట్ల  ఫామ్ లోకి రావాలని  ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. మళ్ళీ పాత శ్రీనువైట్ల ను చూడాలని అభిమానులే కాలేదు తెలుగు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.  ఇదిలా ఉంటె ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో శ్రీనువైట్ల కొన్ని ఆసక్తి కర విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ లో మహేష్ బాబు కు ఎప్పుడు రుణపడి ఉంటానని శ్రీనువైట్ల చెప్పాడు. మళ్లీ తనకు అవకాశం వస్తే దూకుడు నిర్మించే మహేష్ బాబు కు ఇస్తానని అభిమానులకు మాట ఇస్తున్నాడు. శ్రీను వైట్ల ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు తో ఛాన్స్ అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. శ్రీను వైట్ల ఫామ్ లో ఉన్న టైం కి ఇప్పుడు ఉన్న టైం కు టాలీవుడ్ పరిస్థితి చాలా మారిపోయింది. హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటే ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి కథ తో మహేష్ బాబు ఒప్పిస్తాడో అనేది చూడాలి. దానికంటే ముందు శ్రీను వైట్ల ఒక సాలిడ్ హిట్ కొట్టాలి. ఆ తర్వాత మహేష్ బాబు దృష్టిలో పడాలి .అప్పుడు గాని మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ శ్రీనువైట్లకు రాదు. మరి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకొని చేస్తున్న డి అంటే డి అనే సినిమా  ఆయనకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: