సినీ ఇండస్ట్రీలో అప్పటికీ, ఇప్పటికీ వన్నె తరగని అందంతో.. నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి, ఇప్పటికీ అభిమానులను చూరగొంటున్న నటి రమ్యకృష్ణ అని చెప్పవచ్చు. ఈమె కళ్ళల్లో రాజసం ఉట్టిపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ, అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా బాగా అలరించింది. ముఖ్యంగా, నరసింహ సినిమాలో నీలాంబరిగా ఈమె చేసిన నటన ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉంది రమ్యకృష్ణ కు. ఇక బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది రమ్యకృష్ణ.రమ్యకృష్ణ భర్త ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ అని మనకు తెలిసినదే. కృష్ణవంశీ కూడా తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా.. మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి, మంచి  డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన గులాబీ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో  ఒక  పాట "మేఘాలలో తేలిపొమ్మన్నది".. అనే పాటలో జేడీ చక్రవర్తి, మహేశ్వరి పై చిత్రీకరించిన ఈ పాట తో, ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.అయితే రమ్యకృష్ణ ఇద్దరు ప్రముఖుల వల్లే ఈరోజు సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. అది ఎందుకు అంటే , కృష్ణవంశీని తన భర్తను చేయడం వల్లే ఆమె ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అని తెలిపింది. అయితే ఎవరు ఆ ప్రముఖులు అనగా .. బ్రహ్మానందం అలాగే మోహన్ బాబు. ముందు మొదటగా రమ్యకృష్ణ ను కృష్ణవంశీకి  పరిచయం చేసింది మోహన్ బాబే.. "అదిరింది అల్లుడు" అనే సినిమాను కృష్ణ వంశీ మోహన్ బాబు తో తీస్తున్న సమయంలో, మోహన్ బాబు రమ్యకృష్ణ కృష్ణవంశీకి పరిచయం చేయడం. ఇక ఆ తర్వాత బ్రహ్మానందం కూడా రమ్యకృష్ణ గురించి కృష్ణవంశీకి బాగా చెప్పారు.అలా వీరిద్దరూ కృష్ణవంశీకి చెప్పడం వల్లే సుమారుగా ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకొని, 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా జన్మించారు .పేరు రిత్విక్ కృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: