తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకొని స్టార్ సింగర్ గా దూసుకుపోతున్నాడు గాయకుడు అనురాగ్ కులకర్ణి. సినిమా పరిశ్రమలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద హీరోల సినిమాలకు పాడుతూ నెంబర్ వన్ గాయకుడిగా దూసుకెళ్తున్నాడు అనురాగ్. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ గాయకుడికి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. స్టార్ మా లో ప్రసారం అయిన ఐడియా సూపర్ సింగర్ షో ఎనిమిదవ సీజన్ కి విన్నర్ గా నిలిచిన అనురాగ్ కులకర్ణి ఆ తర్వాత సింగర్ గా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి అద్భుతమైన గాయకుడు అనిపించుకున్నాడు.

హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని బాగా సాధన చేసి ఇప్పుడు ఈ రేంజ్ లో గాయకుడు గా ఎదిగాడు. ఎం.ఎం.కీరవాణి కె.ఎస్.చిత్ర వంటి సంగీత దిగ్గజాల మెప్పును పొందిన ఈయన వీరితోనే ఇప్పుడు కలిసి పనిచేయడం విశేషం. అంతేకాకుండా తన గాత్రానికి గాను తెలుగు సినిమా పరిశ్రమ  ఎంతగానో మెచ్చి పలు అవార్డులు కూడా ఆయనకు అందజేసింది. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాడిన పిల్ల రా పాట కు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు అందించింది. 

 అలాగే ఫిలింఫేర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కి కూడా ఆయన నామినేట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే పాడుతూ ఉండడం విశేషం. ఇతర గాయకులతో పోలిస్తే ఈ గాయకుడు ఫుల్ బిజీగా ఉన్నట్లు చెప్పాలి. ఇటీవల కాలంలో విడుదలైన సీటీ మార్ చిత్రంలో టైటిల్ సాంగ్ ను ఆలపించారు అనురాగ్. అలాగే త్వరలోనే విడుదల కాబోతున్న మ్యూజిక్ సెన్సేషనల్ సినిమా లవ్ స్టోరీ చిత్రం లో కూడా నీ చిత్రం చూసి అనే పాటను ఆలపించారు. అలాగే కీరవాణి సంగీత దర్శకత్వంలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఓ అద్భుతమైన పాటను ఆయన పాడినట్లు తెలుస్తుంది. మరి ఈ యువ సంగీత సంచలనం భవిష్యత్తులో ఎలాంటి  సంచలనాలు సృష్టిస్తాడ చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: