అశ్లీల చిత్రాల కేసులో మోడల్, నటి గెహనాకు తాజాగా ఊరట లభించింది. చాలా కాలంగా అశ్లీల చిత్రాల ఆరోపణలు ఎదుర్కుంటోంది గెహనా. ఈ కేసులో తనను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులు చూస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఇటీవల ఈ నటి ముందస్తు బెయిల్ కోసం బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఆమెకు బెయిల్ ను నిరాకరించింది. కానీ ఇప్పుడు భారతదేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించింది. ఈ కేసులో గెహనా ముందస్తు బెయిల్ పొందవచ్చని స్పష్టం చేసింది.

అశ్లీల చిత్రాలను తయారు చేసే రాకెట్‌ను గురించి దర్యాప్తు జరుగుతున్న కారణంగా తమకు కస్టడీ అవసరమని అవతలి వారు చెప్పారని గెహనా తరఫు న్యాయవాది అజిత్ వాగ్ కోర్టులో వాదించారు. మొదటి ఎఫ్ఐఆర్ తరువాత గెహనాను అదుపులోకి తీసుకున్నారని, ఆమె 133 రోజులు జైలులో ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు.  దీంతో ఈ కేసులో నమోదైన మూడో ఎఫ్ఐఆర్ లో గెహనా అరెస్టుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీనితో పాటు అవసరమైతే దర్యాప్తులో సహకరించాలని కోర్టు గెహనాను కోరింది. ఇప్పుడు ముంబై పోలీసులు ఈ నటిని అరెస్ట్ చేయలేమన్న మాట.

ఇంతకు ముందు సెషన్ కోర్టులో గెహనా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆ తరువాత ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా నటికి షాక్ తప్పలేదు. సెషన్స్ కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల పిటిషన్‌లో బాంబే హైకోర్టు గెహనా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

రాజ్ కుంద్రా కంటే ముందు ఒకప్పుడు అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన గెహనా సుప్రీం కోర్టుకు వెళ్ళింది. చివరకు ఇప్పుడు ఆమెకు ఉపశమనం లభించింది. కొంతకాలం క్రితం గెహనా అరెస్టుకు భయపడి తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: