కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో దశాబ్దాలుగా వినువిందు చేస్తున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరనే వార్త ఇప్పటికీ కొంత మంది ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. ఆయన తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించగా ఆ గొంతు ఇక పాడదనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చిరునవ్వు తో తిరిగి వస్తారనుకుంటే కానరాని లోకాలకు తరలిపోయారు. ఇది అందరికీ చేదు జ్ఞాపకం గా ఉండిపోయింది.  ఆయన లేరనే వార్త తలచుకుంటే ప్రతి అభిమాని గుండె కన్నీటి సంద్రం గా మారడం నిజమే.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కరోనా తో సుదీర్ఘ పోరాటం చేసిన తరువాత ఇక సెలవంటూ తనువు చాలించి అప్పుడే సంవత్సరం గడిచిపోతుంది. దశాబ్దాలుగా తన గానంతో జనాలను ఎంతగానో అలరించిన ఆ గానధార సెప్టెంబర్ 25 వ తేదీన ఆగిపోగా ఆయన మరణానికి ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పిన బాలు ఇలా అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్లిపోవడం ఇప్పటికీ తీరని లోటు. తెలుగు సినిమా చరిత్రలో మాత్రమే కాదు దేశ సినిమా చరిత్రలోనే గాయకుడిగా తనదైన ముద్ర వేసిన బాలసుబ్రహ్మణ్యం 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడుగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ప్రేక్షకులు ఆయన్ని ఆదరించడానికి ఎంతో సమయం పట్టలేదు. తొలి పాటంతో అందరినీ ఆకట్టుకున్న బాలు ఆ తరువాత మరిన్ని అవకాశాలు అందుకుని వేల కొలది పాటలు పాడారు. మొదట్లో ఎక్కువగా తెలుగు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చేవి ఆయనకు. ఆ తర్వాత అన్ని భాషల సంగీత దర్శకులు పిలిపించుకునే వారు. నటుల హావభావాలకు తగ్గ భావాలను పలికిస్తూ వారిని శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. ఏ నటుడికి పాడినా కూడా బాలసుబ్రమణ్యం అనటుడే పాడినట్లు అనిపిస్తూ పాటలు పాడి నటులను సైతం ఇంప్రెస్ చేసేవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: