టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న   మూవీ 'బంగార్రాజు' . సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్ర నికి ప్రీక్వెల్గా తెరకెక్కుతోంది. 'సోగ్గాడే చిన్నినాయన' మూవీ లో నాగార్జున పాత్ర పేరు 'బంగార్రాజు' ఆ పేరునే ఈ సినిమాకు టైటిల్ గా ఖరారు చేశారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల పరిస్థితులు బాగా లేకపోవడంతో వాయిదా పడింది. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించిన చిత్ర బృందం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 ఆ వార్త ఏంటంటే ఈ సినిమాలో ఒకే పాటలో నాగార్జున ఐదుగురు హీరోయిన్ లతో కలిసి డాన్స్ చేస్తాడట. ఇప్పటికే ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ఐదుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి ఆఫీషియల్ ప్రకటన విడుదల కాలేదు. బిగ్ బాస్ ప్రోగ్రాం తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మెనాల్ గజ్జర్, మీనాక్షి చౌదరి ఇద్దరు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా రేంజ్ లో హిట్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: