టాలీవుడ్ లో ప్రశుతం డ్యాషింగ్ డైరెక్టర్ గా మంచి పేరు, పాపులారిటీ తో పాటు ఆడియన్స్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్న దర్శకడు పూరి జగన్నాథ్. తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి, ఆ మూవీతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత నుండి అనేక సినిమాలు చేస్తూ మధ్యలో పలు సక్సెస్ ల తో పాటు సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా సొంతం చేసుకున్న పూరి జగన్నాథ్ ఆ మధ్యన వరుసగా పరాజయాలు చవిచూశారు.

అయితే రెండేళ్ల క్రితం రామ్ హీరోగా ఆయన తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా పూరి ని మళ్ళి లైం లైట్ లోకి తీసుకువచ్చింది. ఇక ఆ మూవీ సక్సెస్ ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలు నిర్మిస్తుండగా ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కిక్ బాక్సర్ గా కనిపించనుండగా అయన తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నట్లు టాక్.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి మరొక మూడు రోజుల్లో ఒక భారీ అప్ డేట్ రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. విషయం ఏమిటంటే, ఈనెల 28న పూరి జన్మదినం కావడంతో లైగర్ నుండి ఫస్ట్ సాంగ్ లేదా టీజర్ గురించి పక్కాగా అప్ డేట్ కి ఛాన్స్ ఉందని, మరి అదే కనుక నిజం అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కాగా ఈ సినిమాని వీలైనంత త్వరలో పూర్తి చేసి ఈ ఏడాదిలోనే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా యూనిట్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: