అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తీసిన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ. ఏమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు సి హెచ్ పవన్ మ్యూజిక్ అందించగా సినిమాలో ఇతర ముఖ్య పాత్ర లని ఉత్తేజ్, దేవయాని, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు పోషించారు. ఎన్నో మంచి అంచనాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొత్తంగా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఆకట్టుకునే కథ, కథనాలతో మధ్యతరగతి యువతీ యువకుల స్వచ్ఛమైన ప్రేమకి దృశ్యరూపకంగా ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేక్షకాభిమానులు నుండి మంచి పేరు అందుకుంటున్నారు. గతంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి లతో ఫిదా వంటి సూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల, ప్రస్తుతం మరొక్కసారి ఈ లవ్ స్టోరీ తో కూడా హిట్ కొట్టడంతో సినిమా ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక విడుదలైన మూడు రోజులకు గాను మొత్తం రూ.22 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా త్వరలో బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడంతో పాటు ఆపైన చాలా వరకు మంచి లాభాలు సంపాదించే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ గా లవ్ స్టోరీ నిలవనుందని అంటున్నారు. ఇక ఈ మూవీలో రేవంత్ గా నాగ చైతన్య, మౌనిక గా సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజీవ్ కనకాల కనిపించారు. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పుతో మంచి క్రేజ్, కలెక్షన్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఎంత మేర కొల్లగొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: