ఆడవారు ఒక్క రోజు నిద్ర మేలుకోకపోతే చాలు.. ఆ రోజంతా ఆ ఇంట్లో వాళ్లకు నరకంగానే అనిపిస్తుంది.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ అలుపు లేకుండా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరాయంగా పని చేసేది కేవలం మహిళ మాత్రమే. అలాంటి ఈ మహిళకు ఏ నాటికి స్వతంత్రం వస్తుందో తెలియదు కానీ.. ఆ స్వతంత్రం కోసం నిరంతరం పోరాడుతూనే వస్తోంది.. ఇలా ఒక చక్కటి కాన్సెప్ట్తో అద్భుతంగా ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమా పేరుతో తెరకెక్కించారు.. ఈ సినిమా కరోనా సమయంలో కూడా విడుదలయి ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టింది..

దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయ రంగం నుంచి తిరిగి సినీ రంగ ప్రవేశం చేసి ఈ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకులకు వద్దకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.. ఇక ఈ సినిమాను బేవ్యూ ప్రాజెక్ట్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే శిరీష్ కలిసి నిర్మించారు.. ఇక ఈ సినిమా లో అనన్య నాగల్ల, అంజలి, నివేదాథామస్ అద్భుతంగా నటించారు..

కథానాయిక పాత్రలో శృతి హాసన్ మూడో సారి పవన్ కళ్యాణ్ తో జత కట్టడం విశేషం. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే, కరోనా సమయంలో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఈ సంవత్సరం రికార్డు సృష్టించింది. 2021 ఏప్రిల్ 9వ తేదీన కరోనా కాలంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 137.65 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.. ఇకపోతే ఈ సినిమాలో వచ్చిన" మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. అనే పాట ఎంత అద్భుతం అంటే ఒక మహిళ లేనిదే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు అన్న అర్థం వచ్చేలా ఈ పాటను చిత్రీకరించారు.. ఇక ఈ పాట విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే మంచి వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంది. ఇక నాటి నుంచి నేటి వరకు కూడా ఈ పాట హైలెట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: