తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కాంపౌండ్ కు చెందిన ఇద్దరు హీరోల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందా ? ఈ ఇద్దరు హీరోలు కూడా తామే నెంబర్ వన్ హీరోగా ఉండాలి అని పంతానికి పోతున్నారా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. మెగా కాంపౌండ్ హీరోలుగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి రంగస్థలం సినిమా కు ముందు వరకు కూడా బన్నీ ఇండ‌స్ట్రీలో తన ఆధిపత్యం చాటుకుంటూ వచ్చారు.

అయితే రంగ‌స్థ‌లం సినిమాకు ముందు వ‌ర‌కు కూడా చాలా మంది అస‌లు రామ్ చ‌ర‌ణ్‌కు న‌టించ‌డ‌మే రాద‌ని విమ‌ర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ సినిమాలో చిట్టిబాబు గా చ‌ర‌ణ్ చేసిన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. రామ్ చ‌ర‌ణ్ క్రేజ్ కూడా అమాంతం పెరిగి పోయింది. అదే టైంలో బ‌న్నీకి రెండు వ‌రుస ప్లాపులు ప‌డ‌డంతో బ‌న్నీ మార్కెట్ డౌన్ అయ్యింది.

ఇక అల వైకుంఠ పుర‌ములో సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు బ‌న్నీ మార్కెట్ ను ప‌ట్టుకోవడం చెర్రీకి క‌ష్ట‌మవుతోంది. అదే టైంలో చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ లాంటి డిజాస్ట‌ర్ సినిమాతో ఇబ్బంది ప‌డుతున్నాడు. ఇక ఇప్పుడు బ‌న్నీ పుష్ప సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. అటు చెర్రీ కూడా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై ఆశ‌లు పెట్టుకున్నాడు.

ఇలా వీరిద్ద‌రు కూడా ఇటీవ‌ల కాలంలో త‌మ సినిమా ల‌తో తామే పై చేయి సాధించాల‌న్న త‌ప‌న‌తో ఉన్నార‌ని. ఇది ఇద్ద‌రి మ‌ధ్యా ఓ విధంగా పంతానికి కూడా పోతోన్న‌ట్టు అయ్యింద‌ని చెపుతున్నారు. మ‌రి ఈ వార్ భ‌విష్య‌త్తులో ఎలా మారుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: