డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతూ.. ఏ హీరో టచ్ చేయలేనంత దూరంగా ఉన్నాడు. ఇప్పట్లో ప్రభాస్ ని అందుకునే ప్రయత్నం కూడా ఏ హీరో చేయలేరు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. బాహుబలి సినిమా ముందు వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ వేరు..ఆ తరువాత చేస్తున్న సినిమాలకు తీసుకుంటున్న పారితోషకం వేరు. ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఆ నెంబర్ ను కూడా పెంచేసి 150 కి చేసిన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న "రాధేశ్యామ్" సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ..సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అభిమానులను బాగా అట్రాక్ట్ చేసాయి. తాజాగా మరో సాంగ్ టీజర్ ను విడుదల చేసారు మూవీ టీం.

"ఆషికీ ఆ గయీ" అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉంది. ఇక ఈ సాంగ్ లో పూజా, ప్రభాస్ రొమాంటిక్ స్టిల్స్ యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే.. "మిర్చి" సినిమాలో ప్రభాస్-అనుష్క చేసిన ఓ రొమాంటిక్ సీన్ లాగే "రాధేశ్యామ్" లో కూడా  "ప్రభాస్ - పూజా హెగ్డే"లు చేసారు. ఈ విషయాని  కనిపెట్టిన ఫ్యాన్స్ ఆ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వైరల్ గా మార్చారు. ఇక ఆ ఫోటో ని అభిమానులు షేర్ చేస్తూ.. "రెండు జంటల్లో ఒకరే హీరో.. కానీ హీరోయిన్ లు మాత్రమే మారారు" అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు. ఇక అభిమానుల్లో  ప్రభాస్ - అనుష్క జోడీ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ జోడీ మళ్లి తెర కనిపిస్తే చూడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: