కోవిడ్-19 కోత్త వేరియంట్ వచ్చేసింది. భారత్ తో సహా పలు దేశాల్లో ఆంక్షలు ఇప్పుడిప్పుడే ఆరంభం అవుతున్నాయి. అఖండ సినిమా రిలీజ్ అవుతుందా ? కాదా ? అన్న మీమాంసలను ఈ సినిమా దాటింది. విదేశాలలో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు. సినిమా విడుదల అవుతున్న నగరాలలో పెద్ద సంఖ్యంలో కార్య ర్యాలీలు జరుగుతున్నాయి. తెలుగు వారంతా ఒక చోట గుమికూడటం అన్నది జరిగి చాలా కాలమే అయింది. దాదాపు రెండు సంవత్సరాల విరామం తరువాత తెలుగు వారంతా ఒక చోట సమావేశమవతున్నారు. అఖండ మైన పండుగను సెలిబ్రేట్ చేసుకుంటున్నారు.
అమెరికాను చెందిన  సినిమా హాళ్ల చైన్  సినీ మార్క్... అఖండ  చిత్ర మ్యూజిక్ గురించి  తమ థియేటర్ల ముందర బోర్డులను ఏర్పాటు చేసింది. తెలుగు వారుండే ప్రాంతంలో బాలకృష్ణ సినిమా హిట్ కావడం, రికార్డులను తిరిగి రాయడం అన్నది మామూలే. ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న అమెరికా లాంటి నగరాలలో నూ అఖండ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  లండన్ నగరంలో భారత్ కు చెందిన యువత వీధుల్లోకి వచ్చి నృత్యం చేస్తున్నారు. వీరిలో తెలుగువారి కన్నా ఎక్కువ సంఖ్య లో హిందీ  సినీ అభిమానులు ఉండటం గమనార్హం. దీనిని బట్టి చూస్తుంటే  ప్రవాస భారతీయ్యులలో నందమూరి బాలకృష్ణకు  పెద్ద ఫాలోయింగ్ ఉన్నట్లు కనబడుతోంది.
సినిమాకు సరిహద్దులు లేవని నిరూపించిన సినిమా అఖండ. సప్త సముద్రాల అవతల కూడా అఘోరాలుంటారని ప్రతీతి.  అందుకేనేమో  అఖండ చిత్రం  అంచనాలను మించి బిజినెస్ చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ల రేట్ల విషయంలో వివాదం  ఇంకా చల్లార లేదు.  దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో అఖండ బిజినెస్ తగ్గే అవకాశాలున్నాయని సినీరంగ పరిశీలకులు భావిస్తున్నారు. కానీ వారి అంచనాలు  తప్పేతట్లు ఉన్నాయని  నందమూరి అభిమానులు పేర్కోంటున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు టిఆర్ ఎస్ ప్రభుత్వం అనుమతించింది.  దీంతో ఈ దఫా ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువగా  బిజినెస్ తెలంగాణ ప్రాంత  సినీ పంపిణీ దారులకు  పెద్ద ఎక్కున లాభాలు వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: