శ్యామ్ సింగ రాయ్ సినిమాతో కెరియర్ లో ఒక గుర్తుండిపోయే హిట్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. చాలా గ్యాప్ తర్వాత ఓ మంచి విషయం ఉన్న సినిమా తీశాడురా అని అనిపించుకున్నాడు నాని అయితే అంతకుముందు కూడా నాని కొత్త ప్రయత్నాలు చేసినా అది వర్క్ అవుట్ కాకపోయే సరికి రొటీన్ సినిమాలతో లాగించేశాడు. కానీ శ్యామ్ సింగ రాయ్ తో నాని లో మరో నాని కనిపించాడు. ఇక రానున్న సినిమాల్లో కూడా అదే విధంగా కొత్త ప్రయత్నాలతో అలరిస్తాడని అంటున్నారు. నాని నెక్స్ట్ చేస్తున్న అంటే సుందరానికీ తో పాటుగా దసరా అని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ ప్లాన్ చేశాడు.

తెలంగాణా నేపథ్యంతో పీరియాడికల్ కథతో.. కోల్ మైన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందిస్తుందని అంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దశకత్వంలో నాని ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తారని టాక్. దసరా సందర్భంగా వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ అంచనాలు పెంచింది. ఈ సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ తో ఊర మాస్ యాటిట్యూడ్ తో కనిపిస్తాడట. ఒక్కమాటలో చెప్పాలంటే పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్ర తరహాలో దసరా సినిమాలో నాని పాత్ర ఉంటుందట. నాని పాత్ర పక్కా తెలంగాణా యాసతో దుమ్ముదులిపేస్తాడని టాక్.

నానికి దసరా ఖచ్చితంగా ఒక పుష్ప లాంటి సినిమా అవుతుందని చెప్పుకుంటున్నారు. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ పెట్టేస్తున్న ఈ దసరా మూవీలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. కథ బాగా వచ్చిందని.. ఈ సినిమా నాని కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని అంటున్నారు. అంతేకాదు దసరా సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నాని స్టామినా చూపించేలా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: