పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకు బ్రేకులు పడ్డాయంట. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, వార్తా పత్రికల్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఇది. ఒక స్టార్ హీరో సినిమా ఆగిపోవడం అనేది సాధారణ విషయం కాదు. కానీ ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం.. సినిమాకు బ్రేకులు పడ్డాయనే వార్తకు రెస్పాండ్ కాకపోవడంతో పలువురు ఈ వార్త వాస్తవమనే అనుకుంటున్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ మొదలు పెడతారని భావించారు. భీమ్లా నాయక్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమా పూర్తయినా.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తొలిసారిగా ఒక హిస్టారికల్ మూవీలో నటించనున్నారు. దీంతో ఈ సినిమా ఉండబోతుందని ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారు.


అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువగా అవుతుందని అనుకున్నారంట. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపించడంతో.. ఈ సినిమాను చిత్రీకరించడానికి ముందుకు రావట్లేదన్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ సినిమాను చిత్రీకరించాలంటే.. బడ్జెట్‌కు వెనుకడుగు వేయని నిర్మాణ సంస్థ ఉండాలని పలువురు పేర్కొంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌కు నిర్మాతలు రాకపోవడం పెద్ద విశేషమేమీ కాదు. అయినా ఈ సినిమాను నిర్మాతలు ఆసక్తి చూపకపోవడం నిజంగా పెద్ద అవమానకరమైన విషయమని చెప్పుకోవచ్చు. కాగా, ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ మరో రెండు సినిమాలకు ఓకే చెప్పారు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలో సెట్స్ పైకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: